పేరెంట్స్‌కు దూరంగా పెరిగే పిల్లల్లో ఆత్మ విశ్వాసం తక్కువ.. అధ్యయనంలో వెల్లడి

by Prasanna |   ( Updated:2023-05-28 05:33:24.0  )
పేరెంట్స్‌కు దూరంగా పెరిగే పిల్లల్లో ఆత్మ విశ్వాసం తక్కువ.. అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్ : బాల్యంలో, యవ్వనంలో పేరెంట్స్‌కు ఉండి పెరిగిన వారిలో ఆత్మ విశ్వాసం తక్కువగా ఉంటుందని, జీవితంలో ఎక్కువ ఒత్తిడికి, నిరాశకు గురవుతుంటారని ఒక అధ్యయనం పేర్కొన్నది. అదే పేరెంట్స్ సమక్షంలో పెరిగిన వారు జీవితంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నట్లు తేలింది. ఎందుకంటే పేరెంట్స్‌తో ఎక్కువకాలం కలిసి మెలిసి జీవించిన సంతానం సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం కలిగి ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. అంతేగాక వీరిలో పాజిటివ్ థాట్స్ అధికంగా ఉంటాయి. వీరు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుందని ఫిలడెల్ఫియాలోని చిల్డ్రన్ హాస్పిటల్‌కు చెందిన నిపుణుడు డాక్టర్ కరోల్ ఫోర్డ్ (Carol Ford) నేతృత్వంలో పరిశోధకులు వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా వీరు 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సుగల 15,700 మందిని 14 ఏళ్లపాటు స్టడీ చేశారు. పేరెంట్స్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్, కేటాయించే సమయం, అకాడెమిక్‌ ఎక్స్‌పెక్టేషన్స్ వంటివి పిల్లల్లో పాజిటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తాయని, ఇవన్నీ జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండేలా దోహదపడతయాని చెప్తున్నారు.

Also Read: డబ్బు ఖర్చు పెట్టడం వారికి తెలియదా?.. ఇప్పటికీ కొనసాగుతున్న మూసధోరణులు

Advertisement

Next Story

Most Viewed