Sprouted ragi benefits: మొలకెత్తిన రాగులతో మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్.. అవేంటంటే..!

by Kavitha |
Sprouted ragi benefits: మొలకెత్తిన రాగులతో మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్.. అవేంటంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక అందులో మొలకెత్తిన రాగులు తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ అంతా ఇంతా కావు అని అంటున్నారు నిపుణులు. మరి వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు చూద్దాం..

*బేసిక్‌గా మొలకెత్తిన రాగులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుందట. అలాగే రక్తహీనత సమస్య తగ్గడమే కాకుండా ఎముకలు కూడా స్ట్రాంగ్‌గా ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. దీంతోపాటు చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట.

*అదే విధంగా మొలకెత్తిన రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మలబద్ధకం నివారించడానికి, జీర్ణక్రియ మెరుగు పరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందట.

*అలాగే మొలకెత్తిన రాగుల్లో విటమిన్లు, మినరల్స్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందట.

*మొలకెత్తే సమయంలో రాగుల్లో యాంటీఆక్సిడెంట్ల లెవెల్స్‌ పెరుగుతుందట. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

*మొలకెత్తిన రాగుల్లో ప్రోటీన్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఇది కండరాల పెరుగుదలకు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందట.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed