- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Sleep For health : ఏజ్‌ను బట్టి నిద్ర.. ఏ వయస్సు వారికి ఎన్నిగంటలు అవసం?
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తగిన పోషకాహారం, వ్యాయామాలు ఎంత ముఖ్యమో కంటినిండా నిద్ర (sleep) కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. అయితే రకరకాల సమస్యలు, ఒత్తిళ్ల కారణంగా ఇటీవల చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీంతో మెంటల్ డిజార్డర్లు (mental desorders) సహా ఇతర అనారోగ్యాలు దాడిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న సమయంలోనే నాణ్యమైన నిద్రకు ప్రయారిటీ ఇవ్వాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అండ్ స్లీప్ రీసెర్చ్ సొసైటీ నిపుణులు చెప్తున్నారు. వీరి ప్రకారం ఏ వయస్సు వారికి ఎంతసేపు నిద్ర అవసరమో ఇప్పుడు చూద్దాం.
మూడు నెలల వయస్సు లోపు గలవారు అంటే.. నవజాత శిశువులకు రోజుకు దాదాపు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం. ఇక 4 నుంచి 11 నెలలు ఉన్న శిశువులకైతే రోజకు 12 నుంచి 15 గంటల నిద్ర తప్పనిసరి. అలాగే 3 నుంచి 5 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన పిల్లలకు డైలీ కనీసం 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం. ఇక ఆరు నుంచి 12 ఏండ్ల ఏజ్ కలిగిన పిల్లలకు 9 నుంచి 12 గంటల నిద్ర ఉండాలి. 13 నుంచి 18 ఏండ్ల వయస్సు వరకు, అంటే టీనేజర్లకు రోజుకు 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. 18 నుంచి 60 ఏండ్ల వయస్సు వరకైతే 8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. ఇక 60 ఏండ్లు పైబడిన వారందరు కూడా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాకపోతే ఈ వయస్సులో చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు కూడా. అలాంటప్పుడు వైద్య నిపుణులను సంప్రదించాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.