- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెంపదెబ్బ కాంపిటీషన్.. ఇంటర్నేషనల్ లెవల్.. లక్షల్లో బహుమతి.. కానీ..?
దిశ, ఫీచర్స్ : మీరు RXF స్లాప్ ఫైటింగ్ చాంపియన్ షిప్ గురించి విన్నారా? అవును మీరు అనుకున్నది కరెక్టే. చెంపదెబ్బ కాంపిటీషన్. వినేందుకు కాస్త డిఫరెంట్‌గా ఉన్నా ప్రతీ ఏటా ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పోటీపడే ఇద్దరు వ్యక్తులను ఒక కేజ్‌లో ఎదురెదురుగా నిల్చోబెడతారు. ఇద్దరికీ చాక్ పీస్ పొడిని అందిస్తారు. గేమ్ స్టార్ట్ చేసే ముందు ఈ పొడిని చేతులకు రాసుకుని బరిలోకి దిగితే.. ఎదుటి వ్యక్తికి దెబ్బ గట్టిగా తాకుతుంది. ఒక విధంగా చెప్పాలంటే దిమ్మ తిరిగిపోతుంది. ఈ క్రమంలో ఎవరైతే చివరి వరకు ఆటను కొనసాగిస్తారో.. అతనే విజేత.
అయితే తాజాగా RXF స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది. విన్నర్‌కు బెల్ట్‌తో పాటు రూ.4లక్షల బహుమతి కూడా అందించారు. కానీ ఈ రొమేనియన్ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందిన కోమ్సా సోరిన్ ముఖం చూసి నెటిజన్స్ నిర్వాహకులను విమర్శిస్తున్నారు. గాయాలతో రక్తం కారుతున్న మొహం వాచిపోవడం, అతని ప్రత్యర్థి కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉండటంతో తిట్టిపోస్తున్నారు. దీన్ని అనారోగ్యకరమైన ఆటగా పరిగణిస్తున్న నెటిజన్స్.. అసలు ఈ గేమ్‌ను చట్టబద్ధం ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రతీ పోరాట క్రీడలో ప్రత్యర్థి నుంచి రక్షించుకునేందుకు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో మాత్రం తమను చెంపమీద కొట్టేందుకు ప్రత్యర్థిని ఆహ్వానించడం విడ్డూరంగా ఉందంటున్నారు. పైగా బహుమతిగా ఇచ్చే నాలుగు లక్షల రూపాయలు.. విన్నర్ హాస్పిటల్ ఖర్చులకే అయ్యేలా ఉన్నాయి, ఇందులో విజేతకు వచ్చిన ప్రతిఫలం ఏముందని కామెంట్ చేస్తున్నారు.
READ MORE
Junk Food తింటే పురుషుల్లో 'ఆ' సామర్థ్యం తగ్గిపోతుందని తెలుసా !
- Tags
- slap competition