Red Pear : రెడ్‌ పియర్ పండ్లతో లెక్కలేనన్ని ప్రయోజనాలు !

by Sumithra |   ( Updated:2024-08-13 07:56:53.0  )
Red Pear : రెడ్‌ పియర్ పండ్లతో లెక్కలేనన్ని ప్రయోజనాలు !
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించాలన్నా ముందుగా మనం తీసుకునే ఆహారంలో గుర్తుకు వచ్చేది పండ్లు. అవి పుష్కలమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అనేక పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అలాగే రెడ్ పియర్ లో కూడా అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఈ రెడ్ పియర్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. జుట్టును ఒత్తుగా, నల్లగా చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. అంతే కాదు రెడ్ పియర్ జీర్ణ సమస్యలను కూడా అరికడుతుంది. దీనిని సలాడ్‌లు, జామ్‌లు, క్యాండీలు, జ్యూస్ మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు.

రెడ్ పియర్ ప్రయోజనాలు...

ఈ రెడ్ పియర్ ప్రధానంగా పసిఫిక్ ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. ఆపిల్ లో ఉండే కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది.

రెడ్ పియర్ లో ఉండే పోషక విలువలు..

కేలరీలు - 62 కిలో కేలరీలు

కొవ్వు - 0.1 గ్రా

ప్రోటీన్ - 0.3 గ్రా

కార్బోహైడ్రేట్లు - 15 గ్రా

ఫైబర్ - 3 గ్రా

పొటాషియం - 123 మి.గ్రా

కాల్షియం - 11 మి.గ్రా

షుగర్ - 9.5 గ్రా

సోడియం - 1 మి.గ్రా

రెడ్ పియర్ ఆరోగ్య ప్రయోజనాలు

1. గుండె జబ్బుల నివారణ..

రెడ్ పియర్ లో బేరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె సమస్యలతో బాధపడేవారికి మంచి ఎంపిక. అలాగే ఎక్కువ మొత్తంతో పొటాషియంను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

2. ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం..

రెడ్ పియర్ లో విటమిన్ ఎ, సీ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. శరీరంలోని కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆరోగ్యకరమైన శరీర పనితీరును అందిస్తాయి.

3. అలెర్జీ..

ఇతర పండ్లతో పోల్చినప్పుడు రెడ్ పియర్ తిన్నప్పుడు అలెర్జీ ప్రతిచర్యలకు అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. శిశువులకు ఇచ్చే కొన్ని పండ్లలో ఇది కూడా ఒకటని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

రెడ్ పియర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్‌ఫెక్షన్లను అరికట్టడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో కాపర్ ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే వ్యాధులతో కూడా పోరాడుతుంది.

5. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్..

ఈ పండులో ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. అలాగే ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల విభాగంలోకి వస్తాయి. ఇది మధుమేహం ఉన్నవారి పై అద్భుతంగా పనిచేస్తుంది.

6. గట్..

రెడ్ పియర్ లో ఉండే ఫైబర్ ప్రేగు, జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రేగులను సున్నితంగా చేస్తుంది.

7. ఆరోగ్య సమస్యలు..

రెగ్యులర్ రెడ్ పియర్ వినియోగం గౌట్, పిత్తాశయం, ఆర్థరైటిస్, పెద్దప్రేగు సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలో శీతలీకరణ ప్రభావం కారణంగా జ్వరం వచ్చే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెన్ గ్లూటాతియోన్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

8. గొంతు సమస్యలకు చెక్..

ఈ పండు జ్యూస్ గొంతు సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

జుట్టు, చర్మానికి కలిగే ప్రయోజనాలు..

1. చర్మం ముడతలు..

రెడ్ పియర్ లో కాపర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం పై ముడతలు, ఫైన్ లైన్లు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, ఇది చర్మాన్ని టోన్ చేసి రక్షిస్తుంది.

2. స్కిన్ డ్యామేజీని నివారణ..

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇందులోని ఫైబర్ రక్తప్రవాహంలో చక్కెర స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి కొల్లాజెన్ దెబ్బతినకుండా చేస్తుంది.

3. చర్మాన్ని తేమగా ఉంచుతుంది..

రెడ్ పియర్‌లో హ్యూమెక్టెంట్లు ఉంటాయి. ఇవి చర్మంలో ఆరోగ్యకరమైన నీటి సమతుల్యతను ఉంచడం ద్వారా చర్మం తేమను నిలుపుకుంటాయి.

4. సహజ స్క్రబ్బర్..

ఇందులో సహజమైన స్క్రబ్బింగ్ అంశాలు ఉంటాయి. ఇవి ప్రతిచర్యలు లేదా అలెర్జీలు లేకుండా మృత చర్మ కణాలను సులభంగా తొలగిస్తాయి. అంతే కాకుండా పియర్‌లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పెదాల చర్మాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉంచుతుంది.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Read More..

vegetables : కూరగాయల పై రసాయనాలు.. ఏ అవయవాలు దెబ్బతింటాయో తెలుసా ?

Advertisement

Next Story

Most Viewed