Chicken: చికెన్ తినేవారికి షాకింగ్ న్యూస్.. ఆ పార్ట్స్ తినొద్దని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

by Prasanna |
Chicken: చికెన్ తినేవారికి షాకింగ్ న్యూస్.. ఆ పార్ట్స్ తినొద్దని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది వారంలో నాలుగు రోజులు నాన్ వెజ్ ( Non veg) ను తింటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు.. వేరే కూర జోలికి పోరు అందరి ఇళ్ళల్లో కోడి కూర ఉండాల్సిందే. మార్కెట్ లో దీని ధర తక్కువ ఉండటంతో దీనిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. చికెన్ తినడం వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ( Health) ఉన్నాయి. అలాగే , ఇది రుచికరంగా ఉండడంతో దీనిని తినడానికి ఇష్టపడతారు. కానీ, చికెన్‌లోని ( Chicken ) కొన్ని భాగాలను తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అసలు, కోడి లో ఎలాంటి భాగాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

కోడి మెడ భాగం

చాలామంది కోడి మెడభాగాన్ని ఇష్టంగా తింటారు. కోడిలో ఎన్ని ఉన్నా మెడ భాగాన్ని మాత్రమే వేసుకొని తింటుంటారు. కానీ, ఇది మన శరీరానికి అంత మంచిది కాదని , తింటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ మెడ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది. కోడి దీని ద్వారా తన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది. ఆ భాగాన్ని తింటే దానిలో ఉండిపోయిన బ్యాక్టీరియాలను మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. అందుకే కోడి మెడభాగాన్ని తినొద్దని సూచిస్తున్నారు.

కోడి తోక

కోడి తోక చిన్నగా ఉంటుంది. దీనిని కూడా ఎంతో మంది తింటారు. కానీ, ఈ భాగంలో హానికర బ్యాక్టీరియాలు, క్రీములు ఉంటాయి. ఇవి ఎంత ఉడికించిన కూడా నశించవు. ఈ క్రీములు మన శరీరంలోకి చేరి కొత్త ఆరోగ్య సమస్యలు తెస్తాయి. కాబట్టి ఈ భాగాన్ని తినకుండా ఉండటమే మంచిది.

కోడి ఊపిరితిత్తులు

కోడి కోసినప్పుడు ఊపిరితిత్తులను పడేస్తుంటారు. కానీ, కొందరైతే వాటినే ఇష్టంగా తింటారు. కానీ, ఇవే చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీని ఊపిరితిత్తుల్లో అత్యంత హానికారకమైన క్రీములు ఉంటాయట. వీటిని తినడం వలన ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే, వాటిని తినకుండా ఉండటమే బెటర్. కాబట్టి, ఇప్పటి నుంచి చికెన్ తినేటప్పుడు వీటిని వదిలేసి తినండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed