- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శిశువుల ప్రేగుల్లో వేలాది వైరస్‌లు.. క్రానిక్ డిసీజెస్ నుంచి రక్షిస్తాయంటున్న సైంటిస్టులు
దిశ, ఫీచర్స్: శిశువుల ప్రేగులలో వేలకొద్దీ వైరస్‌లు ఉంటాయని, అయితే గతంలో మనకు తెలియని 200 కంటే ఎక్కువ వైరల్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. ఆస్తమా, డయాబెటిస్ వంటి క్రానిక్ డీసీజ్‌ల నుంచి ఇవి పిల్లను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. చిన్నపిల్లల్లోని గట్ బాక్టీరియా తరువాతి జీవితంలో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వారిని రక్షించడానికి చాలా ముఖ్యమైందన్న సంగతి దశాబ్దాలుగా తెలిసినప్పటికీ, ఇక్కడ కనుగొన్న అనేక వైరస్‌ల గురించిన నాలెడ్జ్ మాత్రం తక్కువగానే ఉండేది. దీనిని అన్వేషించడానికి యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ నుంచి వచ్చిన హెల్త్ టీమ్ ఏడాదిలోపు వయస్సుగల 647 మంది ఆరోగ్యవంతమైన డానిష్ పిల్లలు డైపర్ కంటెంట్‌లను అధ్యయనం ఐదేళ్లపాటు అధ్యయనం చేసి మ్యాపింగ్ చేసింది. ‘‘ఈ శిశువుల మలంలో అసాధారణమైన సంఖ్యలో తెలియని వైరస్‌లను మేం కనుగొన్నాం. వేలాది కొత్త వైరస్ జాతులే కాదు, ఇంకా గుర్తించని రెండు వందల వైరస్‌లు ఉండటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అంటున్నారు ఫుడ్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డెన్నిస్ సాండ్రిస్ నీల్సన్. దీనర్థం ఏంటంటే.. జీవితం ప్రారంభ దశలో పిల్లల్లోని గట్ వైరస్‌ల జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటోంది.
ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్న 10 శాతం వైరస్‌లు
నేచర్ మైక్రోబయాలజీలో పబ్లిషైన రీసెర్చ్ ప్రకారం.. సైంటిస్టులు పిల్లల మలంలో మొత్తం 10 వేల వైరల్ జాతులను కనుగొని మ్యాప్ చేశారు. ఇది పిల్లలలో బ్యాక్టీరియా జాతుల సంఖ్య కంటే పది రెట్లు ఎక్కువ. ఈ వైరల్ జాతులు 248 వేర్వేరు వైరల్ ఫ్యామిలీస్‌కు చెందినవి. వీటిలో 16 మాత్రమే గతంలో తెలిసినవి. పరిశోధకుల బృందం ఇంకా 90 శాతం వైరస్‌లను బ్యాక్టీరియా వైరస్‌లుగా గుర్తించింది. వీటిని బ్యాక్టీరియోఫేజెస్ అని పిలుస్తారు. ఈ వైరస్‌లు బ్యాక్టీరియాను తమ హోస్ట్‌లుగా కలిగి ఉంటాయి. అయితే ఇవి పిల్లలకు హాని కలిగించేవి కావు కానీ, మిగిలిన 10 శాతం వైరస్‌లు యూకారియోటిక్‌గా ఉంటాయి. వీటివల్లే అప్పుడప్పుడు పిల్లల్లో వైరల్ ఇన్ ఫెక్షన్స్ వంటివి వస్తుంటాయి. మిగతా గట్ వైరస్‌లన్నీ పిల్లలకు మేలు చేస్తాయి. అయితే ఏడాదిలోపు పిల్లల గట్‌లోకి అనేక వైరస్‌లు ఎలా వస్తున్నాయనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే పిల్లలు వేళ్లను నోటిలో పెట్టుకోవడం, పెంపుడు జంతువులు, దూళి కణాలు, ఇతర వస్తువులను తాకడం ద్వారా అవి పిల్లల్లోకి చేరుతున్నాయని కనుగొన్నారు. రోగ నిరోధక వ్యవస్థలో బ్యాక్టీరియాలు, వైరస్‌లు పోషించే పాత్రను మరింత తెలుసుకోవడం ద్వారా ఆర్థరైటిస్ నుంచి డిప్రెషన్ వరకు చాలామందిని బాధించే క్రానిక్ డిసీజేస్‌ను నివారించేందుకు మార్గం ఏర్పడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..