Risk with alcohol : మద్యం అధికంగా సేవించేవారికి అలర్ట్.. ఈ 6 రకాల క్యాన్సర్ల రిస్క్ పెరగొచ్చు!

by Javid Pasha |
Risk with alcohol : మద్యం అధికంగా సేవించేవారికి అలర్ట్.. ఈ 6 రకాల క్యాన్సర్ల రిస్క్ పెరగొచ్చు!
X

దిశ, పీచర్స్ : మద్యం అధికంగా సేవించడం కాలేయం, ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం మనకు తెలిసిందే. కానీ రీసెంట్ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్ పలు రకాల క్యాన్సర్లతో కూడా ముడిపడి ఉందని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ (ఏఏసీఆర్) - 2024 నివేదిక పేర్కొన్నది. టోటల్ క్యాన్సర్ కేసులలో 5 శాతం వరకు ఆల్కహాల్ వినియోగంతోనే ముడిపడి ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు.

ప్రధానంగా పేగు (కొలొరెక్టర్), రొమ్ము, నోరు, స్వరపేటిక (గొంతు, నోరు), అన్నవాహిక, కాలేయం, స్టమక్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని రీసెర్చర్స్ గుర్తించారు. ఇక సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రిపోర్ట్ ప్రకారం కూడా రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు మద్యం సేవించేవారిలో స్టమక్, ప్యాంక్రియాటిక్, ప్రొస్టేట్ క్యాన్సర్ల రిస్క్ పెరుగుతోంది. కాబట్టి ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.



Next Story

Most Viewed