- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకంటూ ఒక లక్ష్యం ఉంటే.. ఒంటరి తనాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు
దిశ, ఫీచర్స్ : మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా? లోన్లీనెస్ ఫీలింగ్స్‌ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకంటూ ఒక లక్ష్యన్ని ఏర్పర్చుకోండి. ఎందుకంటే, దానిని సాధించే ప్రయత్నం మీలోని ఒంటరితనం పారిపోతుందని, ఎటువంటి మానసిక రుగ్మతలు దరిచేరవని సెంట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. మీ వ్యక్తిగత అంశం కావచ్చు లేదా ప్రపంచంలోనో, లోకల్ కమ్యూనిటీలోనో మార్పు తీసుకురావాలనే తపన కూడా కావచ్చు. టార్గెట్ ఏదైనా సరే.. దాని గురించి ఆలోచించే క్రమంలో మీరు అనేక విషయాలను గ్రహిస్తారు. గొప్ప సామాజిక పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆటంకాలను ఎదుర్కోవడం నేర్చుకుంటారు. అందుకే లక్ష్యంవైపు అడుగులేసేవారిని ఒంటరితనమే కాదు, ఏ ఇతర సమస్యలు కూడా వేధించలేవని నిపుణులు చెప్తున్నారు.
నిజానికి ఒంటరి తనం అనేది మనిషిన కృంగదీస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే మరణాలకు దారితీయవచ్చు అంటున్నారు స్విడ్జర్లాండ్‌లోని జ్యూరిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. దాని ప్రభావాన్ని, ఎదుర్కొనే మార్గాన్ని నోటిఫై చేసే ఉద్దేశంతో వారు 2,300 మంది అడల్ట్స్‌ను స్టడీ చేశారు. అయితే తమ జీవితంలో ఉద్దేశ పూర్వక ఆలోచనలు కలిగిన వారు, ఒక లక్ష్యం ఏర్పర్చుకొని దానికోసం ప్రయత్నిస్తున్న వారు, ఇతరులతో పోల్చితే చాలా తక్కువగా ఒంటరి తనాన్ని అనుభవిస్తారని పరిశోధకులు కనుగొన్నారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎటువంటి మానసిక రుగ్మతలనైనా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యం ఏర్పడుతుందని గమనించారు. జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం, స్పోర్ట్స్ లీగ్‌లో ఆడడం, వచ్చే ఏడాది వరకు ఫలానా ప్రాజెక్టు పూర్తి చేయడం, ప్రజల్లో మార్పు తీసుకురావాలని భావించడం, వృత్తిలో మరింత నైపుణ్యం సాధించాలనుకోవడం, విద్యార్థులైతే కనుగక హై స్కోర్ మార్కులు సాధించాలని టార్గెట్ పెట్టుకోవడం.. ఇలా ప్రతీ ఒక్కరు తమకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, సాధించే ప్రయత్నం చేస్తుంటే ఒంటరి తనంతో పాటు ఎటువంటి మానసిక రుగ్మతలు వేధించలేవని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
Read More..
- Tags
- Life style