- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల వెంట్రుకల్లో స్ట్రెస్ హార్మోన్స్ .. గుండె జబ్బులు వచ్చే చాయిస్ !
దిశ, ఫీచర్స్ : స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ శరీంలో లేదా మెదడులో విడుదలవుతాయని మనకు తెలిసిందే. కానీ తల వెంట్రుకల్లో కూడా ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ విడుదలవుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇది గుండె జబ్బులకు కారణం కావచ్చని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లోని పరిశోధకులు చెప్తున్నారు. ‘క్రానిక్ స్ట్రెస్ అనేది వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనకర్త డాక్టర్ ఎలైన్ వాన్ డెర్ వాల్క్ అంటున్నారు. జుట్టులో గ్లూకోకార్టికాయిడ్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తులకు బ్లడ్ సర్క్యూట్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని అతను వివరించాడు.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 18 ఏళ్లు పైబడిన మొత్తం 6,341 మంది స్త్రీ, పురుషుల నుంచి తల వెంట్రుకలను శాంపిల్స్ కోసం సేకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా జుట్టులోని కార్టిసాల్, కార్టిసోన్ వంటి స్ట్రెస్ హార్మోన్స్‌ను ఎనలైజ్ చేశారు. ఇవి హృదయ సంబంధ వ్యాధులకు దారితీసే పరిస్థితిని అంచనా వేయడానికి ఏడేళ్లపాటు తమ స్టడీని కొనసాగించారు. ఈ వ్యవధిలో 133 సార్లు వివిధ కోణాల్లో పరిశోధనలు నిర్వహించారు. జుట్టులో కార్టిసోన్ లెవల్స్ అధికంగా ఉన్న వారిలో స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని వారు కనుగొన్నారు. అలాగే 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏజ్ వ్యక్తుల్లో ఈ పరిస్థితి 3 రెట్లు అధికంగా ఉంటుందట. గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగా అంచనా వేయడానికి వ్యక్తుల తలవెంట్రుకలు, లేదా జుట్టును విశ్లేషించడం అనేది ఈజీ మెథడ్‌తో కూడిన పరీక్ష అని, భవిష్యత్తులో స్ట్రెస్ రిలేటెడ్ ఎఫెక్టివ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ అందించడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని, ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఎలిసబెత్ వావ్ రోసమ్ పేర్కొన్నాడు.
Read More: వాతావరణాన్ని మార్చే ‘రాక్ వెదరింగ్’ టెక్నాలజీ.. గ్లోబల్ వార్మింగ్ నివారణ సాధ్యమే!