ఒకే కూల్‌డ్రింక్‌లో రెండు స్ట్రాలతో ఎంజాయ్ చేస్తున్నారా?.. క్యాన్సర్ రావచ్చు.. జాగ్రత్త!!

by Prasanna |   ( Updated:2023-04-17 13:40:20.0  )
ఒకే కూల్‌డ్రింక్‌లో రెండు స్ట్రాలతో ఎంజాయ్ చేస్తున్నారా?.. క్యాన్సర్ రావచ్చు.. జాగ్రత్త!!
X

దిశ, ఫీచర్స్: లాలాజలం ద్వారా వ్యాపించే ఎప్‌స్టీన్-బార్ వైరస్ (Epstein-Barr virus) సాధారణంగా ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుందని తెలుసు. అయితే ఇది క్యాన్సర్ వ్యాధికి కూడా కారణం అవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. నేచర్ జర్నల్‌లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే ప్లేటు‌లో తినడం, ఒకే డ్రింక్‌‌లో రెండు స్ట్రాలు వేసుకొని తాగడం, డీపెస్ట్ కిస్సింగ్ వంటి కారణాలతో బాధితుల లాలాజలంలో ఉండే ఈబీవీ ఇతరులకు వ్యాపిస్తుంది. తర్వాత క్యాన్సర్‌గా పరిణామం చెందుతుంది. ప్రపంచ జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మందిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుండగా.. చాలా వరకు ఈబీవీ ఇన్‌ఫెక్షన్స్ తాత్కాలికమైనవే కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్ రీయాక్టివేట్ అయి క్యాన్సర్ కారకంగా మారుతుంది.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల ప్రకారం.. ఎప్‌స్టీన్-బార్ వైరస్ (EBV) వ్యక్తుల శరీరంలో జన్యుపరమైన బలహీనతలను ఆసరా చేసుకొని దాడి చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ను కోల్పోయేలా చేస్తుంది. అంతేగాక ఈ వైరస్ మానవ క్రోమోజోమ్ 11‌కు సంబంధించిన చీలికను ప్రేరేపిస్తుందని, జన్యుపరమైన అస్థిరతను కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా లుకేమియాకు కారణమైన ఆంకోజీన్‌ను(oncogene)ను ప్రోత్సహిస్తూ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడిచేయడం మొదలు పెట్టడం వల్ల కణాలు అదుపు తప్పి క్యాన్సర్‌కు దారితీస్తుందని అంటున్నారు. ‘పాన్-క్యాన్సర్(Pan-Cancer) అనాలిసిస్ ఆఫ్ హోల్ జీనోమ్స్ ప్రాజెక్ట్’లో భాగంగా పరిశోధకులు 38 ట్యూమర్ రకాల్లో క్యాన్సర్లకు సంబంధించిన పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను పరిశీలించారు. ఈ క్రమంలో ఈబీవీ వైరస్ గురించి తెలుసుకున్నారు. తల, మెడ క్యాన్సర్లలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని కనుగొన్నారు.

Also Read..

Happiness: హ్యాపీనెస్ కోల్పోయారా? .. ఆలోచించే తీరునుబట్టే అలా జరుగుతుందట!

Advertisement

Next Story

Most Viewed