- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల్లో 25 శాతం పార్కిన్సన్ రిస్క్‌ను తగ్గిస్తున్న ఫిజికల్ యాక్టివిటీస్
దిశ, ఫీచర్స్ : వాకింగ్, సైక్లింగ్, గార్డెనింగ్, క్లీనింగ్, స్పోర్ట్స్‌లో పాల్గొనడం వంటి రెగ్యులర్ వ్యాయామాలతో మహిళల్లో పార్కిన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం 25 శాతం తక్కువగా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగా పరిశోధకులు 49 ఏళ్ల వయస్సుగల 95,354 మంది మహిళలను అబ్జర్వ్ చేశారు. స్టడీ ప్రారంభంలో పార్కిన్సన్ లేని మహిళల్లో కొంతకాలం తర్వాత 1,074 మందిలో అది డెవలప్ అయినట్లు కనుగొన్నారు. అయితే ఈ సందర్భంగా సదరు మహిళల ఫిజికల్ యాక్టివిటీస్ గురించి వారు 6 ప్రశ్నపత్రాల వరకు పూర్తి చేశారు. వారు డైలీ ఎంత దూరం నడకను కొనసాగించారు. రోజూ ఎన్ని మెట్లు ఎక్కారు. ఇంటి కార్యకలాపాలకు ఎన్ని గంటలు స్పెండ్ చేశారు. అలాగే గార్డెనింగ్ వంటి మితమైన వినోద కార్యకలాపాలు, స్పోర్ట్స్ వంటి మరింత శక్తివంతమైన కార్యకలాపాలకు ఎంత సమయం కేటాయించారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
రెగ్యులర్‌గా ఎక్కువ సమయం వ్యాయామంలో పాల్గొనేవారిలో సంవత్సరానికి ప్రతి వెయ్యిమందిలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. ఇక ఎటువంటి వ్యాయామంలో పాల్గొననివారు, తక్కువ శారీర శ్రమ కలిగి ఉన్నవారు సంవత్సరానికి ప్రతి వెయ్యి మందిలో 0.73 శాతం మంది పార్కిన్సన్ వ్యాధి బారిన పడినట్లు పరిశోధకులు గుర్తించారు. మరో సందర్భంలో మహిళల నివాస స్థలం, మొదటి పీరియడ్స్‌కు సంబంధించిన ఏజ్, అలాగే రుతుక్రమం ఆగిన స్థితి, ధూమపానం, ఫిజికల్ యాక్టివిటీస్ వంటి అంశాలను పదేళ్లపాటు పరిశీలించి పరిశోధకులు విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు అతి తక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ కలిగిన మహిళలు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ కలిగిన వారికంటే 25 శాతం ఎక్కువగా పార్కిన్సర్ వ్యాధి రిస్కును కలిగి ఉన్నట్లు గుర్తించారు. అందుకే ‘‘వ్యాయామం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో కూడిన చక్కటి మార్గం’’ అని పారిస్‌లోని ఇన్సర్మ్ రీసెర్చ్ సెంటర్ (Inserm Research Center) పరిశోధకుడు అలెక్సిస్ ఎల్బాజ్ (Alexis Elbaz) పేర్కొన్నాడు.
.Also Read...