‘డీప్ లెర్నింగ్ మోడల్’.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను అంచనా వేసే కొత్త పద్ధతని కనుగొన్న పరిశోధకులు

by Prasanna |   ( Updated:2023-04-11 06:30:14.0  )
‘డీప్ లెర్నింగ్ మోడల్’.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను అంచనా వేసే కొత్త పద్ధతని కనుగొన్న పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్: బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి పరిశోధకులు ‘డీప్ లెర్నింగ్ మోడల్’ అనే కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీని ద్వారా ‘బ్రెస్ట్ సాంద్రత’ను అంచనా వేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నేడు మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అత్యంత సాధారణమైపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం.. 2020లో 2.3 మిలియన్ల మంది స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. భారతదేశంలో అయితే ప్రతీ 4 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు 2023 ఫిబ్రవరిలో ఒక అధ్యయనంలో తేలింది. దీనిని పూర్తిగా నివారించే పరిస్థితి లేనప్పటికీ, ఈ విధమైన క్యాన్సర్ ప్రమాదాలను అరికట్టడానికి మెడికల్ ఆర్గనైజేషన్స్ ప్రయత్నిస్తున్నాయి. ముందస్తుగా గుర్తించేందుకు వైద్య నిపుణులు రెగ్యులర్ స్క్రీనింగ్‌ని సూచిస్తారు. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి రొమ్ము సాంద్రతను అంచనా వేయడానికి సహాయపడే కొత్త డీప్ లెర్నింగ్ మోడల్‌ కూడా డెవలప్ చేయబడింది. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుసాన్ ఎం ఆస్ట్‌లీ(Susan M Astley) నేతృత్వంలోని పరిశోధనా బృందం ప్రకారం.. డీప్ లెర్నింగ్ బేస్డ్ విధానం ద్వారా రొమ్ము సాంద్రత అంచనాలతో కూడిన డేటా క్యాన్సర్ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి తోడ్పుతుంది. రొమ్ము లోపల ఫైబ్రో-గ్రంధి (fibro-glandular)కణజాలం నిష్పత్తిని నిర్వచించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

పరిశోధనలో భాగంగా రేడియాలజిస్టులు, అడ్వాన్స్‌డ్ ప్రాక్టీషనర్ రేడియోగ్రాఫర్లు, బ్రెస్ట్ ఫిజిషియన్‌లతో సహా నిపుణులు విజువల్ అనలాగ్ స్కేల్‌లో 39.357 మంది మహిళల నుంచి 160,000 పూర్తి-ఫీల్డ్ డిజిటల్ మామోగ్రామ్ చిత్రాలకు సాంద్రత విలువలను కేటాయించారు. ప్రతి మామోగ్రామ్ ఇమేజ్‌కి సాంద్రత స్కోర్‌ను అంచనా వేసే విధానాన్ని ఇన్‌పుట్‌గా తీసుకోవడానికి, డెన్సిటీ స్కోర్‌ను అవుట్‌పుట్‌గా ప్రదర్శించడానికి ‘డీప్ లెర్నింగ్ మోడల్’ తోడ్పడుతుంది. ఇందులో ప్రాసెస్ చేయబడిన ఇమేజెస్ నుంచి లక్షణాలను సంగ్రహించడం, డెన్సిటీ స్కోర్‌ల సెట్‌కు మ్యాపింగ్ చేయడం ద్వారా కచ్చితమైన బెస్ట్ క్యాన్సర్ ప్రభావాన్ని గుర్తించి ట్రీట్‌మెంట్ అందిస్తారు.

వేసవిలో ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Advertisement

Next Story

Most Viewed