- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి ఆహార ఎంపికలు కీలకం.. అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడంలో ఆహార ఎంపికలు కూడా కీలకపాత్ర పోషిస్తాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. ఇందులో భాగంగా పరిశోధకులు 2000 నుంచి 2019 వరకు వినియోగదారులకు ఉద్గారాలను అనుసంధానించే డేటాను విశ్లేషించారు, 2019లో అత్యధిక ఉద్గారాలు కలిగిన దేశాలైన చైనా, ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, యూఎస్‌లలోని ఆహార వినియోగం ప్రపంచ ఆహార సరఫరాలో 40 శాతానికి పైగా అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువుల (GHG) విడుదలకు కారణమైందని వెల్లడించింది. ప్రపంచ ఆహార వ్యవస్థ నుంచి ఉద్గారాలను తగ్గించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూ గ్రహాన్ని, పర్యావరణాన్ని రక్షించడం కష్టమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
ప్రస్తుతం ఫుడ్ సర్కిల్ సిస్టం ద్వారా మానవ నిర్మిత గ్రీన్ హౌప్ వాయువుల విడుదల ఉద్గారాలలో మూడవ వంతుగా ఉందని చెప్తున్నారు. ఫుడ్ సప్లై చైన్స్‌లో ఉద్గారాల పెరుగుదల చైనా, భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో గొడ్డు మాంసం, పాల వినియోగం ద్వారా ప్రేరేపించబడుతోందని, అయితే ఇతర జంతువుల ఆధారిత ఆహారంలో అధిక శాతం ఉన్న అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ఉద్గారాలు తగ్గాయని పరిశోధకులు తెలిపారు. రెడ్ మీట్ అధికంగా తీసుకోవడాన్ని తగ్గించడం, మొక్కల ఆధారిత ప్రోటీన్ వాటాలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రపంచంలో ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ఆరోగ్యపరంగా స్థూలకాయం, హృదయ సంబంధ వ్యాధుల వంటి రిస్కును తగ్గిస్తాయని నెదర్లాండ్ లోని గ్రోనింగ్ యూనివర్సిటీ పరిశోధకుడు ప్రొఫెసర్ క్లాస్ హుబాసెక్ చెప్పారు. మూడింట ఒకవంతు మానవ చర్యలవల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతున్నాయని, అగ్రిఫుడ్ సిస్టం, ప్రపంచ భూ వినియోగం, వ్యవసాయ కార్యకలాపాలలో మార్పులు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆహారానికి సంబంధించిన వార్షిక ప్రపంచ GHG ఉద్గారాలు 20 సంవత్సరాల కాలంలో 14 శాతం పెరిగాయి. జంతు ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడంలో గణనీయమైన పెరుగుదల ఉద్గారాలలో 95 శాతం పెరుగుదలకు దోహదపడింది. ఇది మొత్తం ఆహార ఉద్గారాలలో దాదాపు సగం వరకు ఉందని పరిశోధకులు వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయాలంటే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఆహార సరఫరా గొలుసుల యొక్క ప్రతి దశలోనూ ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: