- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇ- స్కిన్’ను డెవలప్ చేసిన పరిశోధకులు.. అచ్చం మానవ చర్మంలాగే పనిచేస్తుందట!
దిశ, ఫీచర్స్: అంగవైకల్యం ఉన్నవారికి కృత్రిమ అవయవాలు ఉంటాయని మనకు తెలిసిందే. కానీ కృత్రిమ చర్మం మాత్రం ఇప్పటి వరకు లేదు. అయితే ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన బావో రీసెర్చ్ గ్రూప్ పరిశోధకులు మృదువైన, సౌకర్యవంతమైన ఎలక్ట్రానిక్ స్కిన్‌ను డెవలప్ చేశారు. వివిధ కారణాలతో వైకల్యం ఏర్పడి, శరీరంలోని కొన్ని భాగాల్లో స్పర్శ కోల్పోయిన వారికి, ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది వేలు లేదా బొటనవేలు ప్రతిస్పందించే ప్రక్రియను అనుకరిస్తుందట. అచ్చం మానవ చర్మంలాగానే టచ్ ఫీల్ కలిగి ఉంటుంది. వేడి లేదా చల్లటి ప్రదేశాన్ని, వస్తువులను తాకినప్పుడు ఈ కృత్రిమ చర్మం అలర్ట్ అవుతుంది. ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఇ- స్కిన్ వేళ్లు దూరంగా జరుగుతాయి.
మానవ చర్మం సమీపంలోని వస్తువు నుంచి వేడి లేదా చల్లదనాన్ని గ్రహించగల యాంత్రిక గ్రాహకాలను కలిగి ఉంటుంది. ఇది ఇష్టమైన వారి హృదయ స్పందనను, సున్నితమైన లయను గుర్తిస్తుంది. ఎవరైనా చేయి పైకెత్తినప్పుడు, పిడికి బిగించినప్పుడు అది కోపంతో కూడిన పరిస్థితికి సంబంధించిందా, ప్రశాంతమైన పరిస్థితలో ఉన్నదా అనే విషయాన్ని గుర్తించి మెదడుకు సంకేతాలు పంపుతుంది. అయితే కృత్రి అవయవాల ద్వారా కూడా అటువంటి అనుభూతి కలిగే పరిస్థితి ఇన్నాళ్లు ఉండకపోయేది. ప్రస్తుతం పరిశోధకులు డెవలప్ చేసిన ఎలక్ట్రానిక్ స్కిన్(e-skin) ద్వారా అధి సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగవైకల్యం కలిగిన వారు కూడా అచ్చం మానవ శరీరంపై కలిగే వివిధ ఇతర అనుభూతులను ఆస్వాదించగలుగుతారని చెప్తున్నారు.
ఈ అధునాతన ఇ - స్కిన్ టెక్నాలజీ సహాయంతో కృత్రిమ అవయవాల కవరింగ్ అభివృద్ధికి దారితీస్తుంది. ఈ పురోగతిలో ఉత్తమ భాగం ఏంటంటే.. ఇది నేరుగా ధరించిన వారి మెదడుకు విద్యుత్ సంకేతాలను ప్రసారం చేయగలదు. తద్వారా ఒత్తిడి లేదా ఉష్ణోగ్రతలో మార్పులను అనుభూతి చెందుతుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లను ఉపయోగించి స్ట్రెస్, టెంపరేచర్ వంటి పరిస్థితులకు అనుగుణంగా స్పందించి, నరాలను ప్రేరేపించి సమాచారాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు సమాచారం అందిస్తుంది. ఇంద్రియాల ప్రతిస్పందనను, అభిప్రాయాన్ని అందించడానికి, అంగ వైకల్యుల నియంత్రణను మెరుగుపరచడానికి ప్రోస్థటిక్ అవయవాలలో ఈ సాంకేతికతను ఉపయోగించడమే ప్రధాన లక్ష్యమని పరిశోధకుడు జెనాన్ బావో పేర్కొన్నాడు. పరిశోధకులు ముందుగా ఎలుకలకు అమర్చడం ద్వారా ఇ-స్కిన్ పనితీరును పరిశీలించారు. ఇది 5 వోల్ట్‌లతో నడుస్తుందని, నిజమైన చర్మానికి సమానమైన ఉద్దీపనలను గుర్తిస్తుందని బావో ల్యాబ్‌లోని మరో పరిశోధకుడు వీచెన్ వాంగ్ అన్నారు. భవిష్యత్తులో మానవులకు సహాయపడుతుందని చెప్పారు.
Read More: ముద్దు పాఠాలు నేర్పుతున్న ప్రాచీన గ్రంథాలు.. సెక్సీ కిస్ ఎప్పుడు ప్రారంభమైందంటే..