- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Fiber food : ఫైబర్ ఫుడ్‌తో ఆ సమస్యకు పరిష్కారం.. పరిశోధనలో ఇంట్రెస్టింగ్ విషయాలు
దిశ, ఫీచర్స్ : ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి పీచు పదార్థం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే అధిక బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నప్పుడు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడంవల్ల తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పీచు పదార్థం కలిగిన ఆహారాలతో కేవలం ఈ లాభాలు మాత్రమే కాదు, మతిమరుపు కూడా తగ్గుతుందని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
స్టడీలో భాగంగా నిపుణులు 40 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన అనేక మంది ఆహారపు అలవాట్లను, జీవన శైలి పద్ధతులను పరిశీలించారు. వీరిలో ఏయే ఆహారం తీసుకుంటున్నవారు మతి మరుపునకు కారణం అయ్యే డెమెన్షియా బారిన పడ్డారో, వారు తరచుగా తీసుకుంటున్న ఆహారం ఏమిటో కూడా ఎనలైజ్ చేశారు. కాగా ఈ సందర్భంగా పరిశోధకులు తీసుకుంటున్న ఆహారంలో భాగంగా పీచు పదార్థం ఎక్కువగా తీసుకున్న వారిలో మెరుగైన ఫలితాలను కనుగొన్నారు. రోజులో యావరేజ్‌గా 20 గ్రాముల ఫైబర్ ఫుడ్ తీసుకోవడంవల్ల డెమెన్షియా ముప్పు తక్కువగా ఉంటోందని, ఎనిమిది గ్రాముల ఫైబర్ తీసుకుంటున్న వారిలో మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉందని గుర్తించారు. అంతేకాకుండా ఫైబర్ ఫుడ్ అధిక బరువు, అధిక రక్తపోటు నివారణలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. మెదడు, పేగు ఆరోగ్యానికి కూడా ఫైబర్ ఫుడ్ చాలా ముఖ్యం. పరోక్షంగా జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.