ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు.. ఎందుకంటే..

by Dishafeatures2 |
ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మనుషులు వందేండ్లు, అవసరమైతే ఇంకా ఐదారేండ్లు ఎక్కవగానే బతికే వారు. కానీ ప్రస్తుతం 60 ఏండ్లు దాటితే ఎంతకాలం జీవిస్తారో గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులు, ఆధునికత ప్రభావం, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి వంటివి మానవుని ఆయుయు క్షీణతకు కారణం అవుతున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు. అయితే ఈ పరిస్థితి అంతటా ఒకేలా లేదు. కొన్నిదేశాల్లోని ప్రజలు మిగతా దేశాల ప్రజలకంటే ఎక్కువకాలం జీవించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

అందుబాటులో ఆధునిక వైద్య సౌకర్యాలు, అవసరమైన పౌష్టికాహారం, హెల్తీ లైఫ్ స్టైల్ వంటివి ఆయా దేశాల్లోని ప్రజలు ఆరోగ్యంగా జీవించడంతోపాటు వారు ఎక్కువ కాలం బతికి ఉండేందుకు దోహదం చేస్తున్నాయి. అలాంటి వాటిలో జపాన్, స్విడ్జర్లాండ్, సింగపూర్, చైనా, హాంకాంగ్ ముందు వరుసలో ఉన్నాయి. మిగతా దేశాల్లో ఎక్కువమంది ప్రజలు 60 ఏళ్లు పైబడిన తర్వాత 70 ఏళ్లలోపు వివిధ అనారోగ్యాలతో చనిపోతుంటారు. కానీ ఈ దేశాల్లో మాత్రం మెజార్టీ ప్రజలు 87 ఏండ్లకు పైగానే ఆరోగ్యంగా బతుకుతారని నివేదికలు పేర్కొంటున్నాయి.

Next Story

Most Viewed