- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని చట్నీ.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ అదే తినాలనిపిస్తుంది..
దిశ, వెబ్‌డెస్క్ : చాలామంది వారి వారి ఇండ్లలో టమాటా చట్నీని చేసే ఉంటారు. కానీ వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చేసే ఈ చట్నీ రుచిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ తినాలనిపిస్తుంది. దీని రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకు ఈ చెట్నీ వడ్డించారంటే వారి మెప్పులు పొందాల్సిందే. ఈ సౌత్ ఇండియన్ స్టైల్ చట్నీ చేయడం చాలా సింపుల్. ఈ టమోటా చట్నీని సమోసాలు లేదా పకోడాలతో ప్రయత్నించండి. మీరు దీన్ని రోటీ, పరాటా, ఇడ్లీ లేదా అన్నంతో కూడా వడ్డించవచ్చు.
వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా టమాటా చట్నీ రెసిపీ..
కావలసిన పదార్థాలు..
నూనె : 5-6 చెంచాలు
ఇంగువ : చిటికెడు
శనగపప్పు: 1-2 చెంచాలు
మినపప్పు : 1-2 చెంచాలు
కాశ్మీరీ మిర్చి: 5-6
టొమాటోలు: 4-5 (తరిగినవి)
వేయించడానికి నూనె : 2 చెంచాలు
ఆవాలు : 1tsp
కరివేపాకు : 5-6
తయారుచేసే విధానం..
ముందుగా ఒక పాన్ తీసుకుని గ్యాస్ మీద ఉంచాలి. ఇప్పుడు అందులో 3 స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ, ఒకటి రెండు చెంచాల శనగపప్పు, ఒకటి రెండు చెంచాల మినప పప్పు వేసి వేయించాలి. ఇప్పుడు 5 కాశ్మీరీ మిరపకాయలు వేసి వేయించాలి. వేయించిన తర్వాత, దానికి 4 తరిగిన టమోటాలు యాడ్ చేయండి.
అందులో రుచికి తగిన ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేయాలి. నెమ్మదిగా కలపాలి. టొమాటో కొన్ని నిమిషాల్లో పూర్తిగా మృదువుగా మారుతుంది. ఇప్పుడు మిక్సర్ బ్లెండర్ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ తరువాత చిన్న పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఒక చెంచా ఆవాలు, మినప పప్పు, కరివేపాకు రెబ్బలను వేయాలి. అవి 1 నిమిషం పాటు వేగిన తరువాత టొమాటో పేస్ట్‌ను అందులో వేసి పోవు వేయాలి. దీంతో టేస్టీ వెల్లుల్లి, ఉల్లిపాయ లేని టమాటా చట్నీ రెడీ.