రియల్ లైఫ్ 'లవ్ బర్డ్స్'.. గుడ్లగూబల ఫొటోషూట్!

by Disha News Desk |
రియల్ లైఫ్ లవ్ బర్డ్స్.. గుడ్లగూబల ఫొటోషూట్!
X

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ జనరేషన్ పెళ్లిళ్లకు సంబంధించి 'ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్‌' కామన్ అయిపోయింది. ఈ క్రమంలో రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకునే యంగ్ కపుల్స్.. బురదలో, సమాధులపై, గాయాలతో రకరకాలుగా ఫొటోషూట్ ప్లాన్ చేసి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే మాకేం తక్కువ అనుకున్నాయో ఏమో.. రెండు 'లవ్ బర్డ్స్' సైతం అద్వితీయమైన స్టిల్స్‌తో కెమెరాకు పోజిచ్చాయి. నెటిజన్ల మనసు దోచుకున్న ఆ జంట పక్షుల ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌‌గా మారాయి.

మహారాష్ట్రలోని భండారా వద్ద చెట్టు కొమ్మపై జంటగా కూర్చున్న రెండు గుడ్లగూబలు కెమెరా కంటిని ఆకర్షించాయి. కాగా పక్షుల ఏకాంత దృశ్యాలను అశ్విన్ కెంకరే అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. అయితే ఒక ఫొటోలో ముద్దు లాడుతూ కనిపించిన జంట పక్షులు.. మరో ఫొటోలో లిప్‌లాక్‌లో మునిగిపోవడం విశేషం. ఇదే క్రమంలో ఫొటోగ్రాఫర్ అశ్విన్ 'ఇండియన్ బర్డ్స్' ఫేస్‌బుక్ పేజీలో ఈ పిక్స్‌ పోస్ట్ చేయగా.. తక్కువ టైమ్‌లోనే వైరల్‌గా మారాయి. ఇక ఈ గుడ్లగూబల కొల్లేజ్‌ను ట్విట్టర్‌లో పంచుకున్న ఐఎఫ్‌ఎస్ అధికారి మధుమిత 'ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ అనుకుంటాను!' అని కామెంట్ పెట్టింది. కాగా ఆమె కామెంట్‌తో ఏకీభవిస్తున్న నెటిజన్లు బోలెడన్ని ఫన్నీ ట్వీట్స్, మీమ్స్‌తో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed