Raksha Bandhan: ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో రాఖీ కట్టకండి.. ఆ రోజు పాటించాల్సిన నియమాలు

by Kavitha |
Raksha Bandhan:  ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో రాఖీ కట్టకండి..  ఆ రోజు పాటించాల్సిన నియమాలు
X

దిశ, ఫీచర్స్: మన దేశంలో ప్రతి సంవత్సరం అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ ను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే సోదరులు తమకు జీవితాంతం తోడుగా, రక్షణగా, అండగా నిలవాలని కోరుకుంటూ అక్కాచెల్లెళ్లు వారి చేతికి రాఖీ కడతారు. అంతేకాదు, సోదరులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తారు. కాగా అన్న లేదా తమ్ముడు తన సోదరిని అన్ని విషయాల్లో రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు.

ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి రాఖీ పూర్ణిమ ఆగస్టు 19, సోమవారం నాడు వస్తుంది. ఈ పర్వదినాన సిస్టర్స్ రాఖీ కట్టడంతో పాటు కొన్ని పనులు చేయడం ద్వారా సోదరులతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. అంతేకాదు సోదరుడి జీవితంలో మరింత సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఆ పనులేవో ఇప్పుడు మనం చూద్దాం..

ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఆగస్టు 19న జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. కానీ ఆ రోజు ఉదయం కొంత సమయం భద్ర కాలం ఉంటుంది. భద్ర కాలంలో రాఖీ కట్టడం శుభం కాదని మన పెద్దలు చెప్పారు. అందుకే అక్కాచెల్లెళ్లు భద్ర కాలం ముగిసిన తర్వాత సోదరులకు రాఖీ కట్టాలి.

మరి భద్ర కాలం వివరాలు:

ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్ర కాలం, ఆగస్టు 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:21 గంటలకు మొదలై, ఆగస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:25 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శుభం. అంటే, ఆగస్టు 19వ తేదీ, సోమవారం పూర్ణిమ నాడు మధ్యాహ్నం 1:25 గంటల తర్వాత సోదరులకు రాఖీ కట్టవచ్చు.

మనం పాటించాల్సిన నియమాలు:

రాఖీ కట్టడానికి ముందు సోదరి తన సోదరుడికి ముందుగా హారతి ఇవ్వాలి. అతడి క్షేమం కోసం దేవుడిని ప్రార్థించాలి. సోదరుడి నుదుటిపై బొట్టు పెట్టి, రాఖీ కట్టాలి. తర్వాత స్వీట్లు తినిపించాలి. తర్వాత సోదరులు కూడా ఆమె నోరు తీపి చేయాలి. అనంతరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు.

సోదరీమణులు ఒక ఎర్రటి వస్త్రంలో కుంకుమ, అక్షింతలు, ఒక నాణెం కట్టి, తమ సోదరుడికి ఇవ్వాలి. దీనికి వారికి ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. సోదరుడు సోదరీమణి ఇచ్చిన ఆ నాణేన్ని తన డబ్బు పెట్టెలో ఉంచితే, అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం.

పంచామృతం కీర్:

రక్షాబంధన్ రోజున పంచామృతం కీర్ చేసి పెళ్లి కాని అమ్మాయిలకు ఇస్తే వారికి మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పంచామృతం అంటే ఐదు రకాల పదార్థాలతో చేసిన ఒక రకమైన పాయసం. ఇందులో పాలు, పెరుగు, తేనె, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. ఈ పంచామృతాన్ని పాలతో కలిపి మరిగించి కీర్ చేస్తారు.

గమనిక: (ఈ వార్త కేవలం ఇంటర్నెట్‌ ద్వారా సేకరించినది మాత్రమే. దీన్ని ‘దిశ’ నిర్ధారించలేదని గమనించగలరు.)

Advertisement

Next Story

Most Viewed