- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ ఐదు చిట్కాలతో చలికాలం నుంచి ఇలా రక్షించుకోండి..!
దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం మనిషిపై చాలా ప్రభావం చూపిస్తుంది. అనారోగ్య సమస్యలతోపాటు చర్మ సౌందర్యం కూడా దెబ్బతింటుంటుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్లకు ఈ నాలుగు నెలలు డేంజరే. మరోవైపు చర్మం పోలుసుబారడం, జట్టు ఊడిపోవడం, చుండ్రు పేరుకుపోవడం లాంటి సమస్యలు సర్వసాధారణం. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల క్రీములు అందుబాటులో ఉంటాయి. అయితే బాహ్య సమస్యలే కాకుండా అంతర్గత బాడీ సమస్యలపై ఫోకస్ చేస్తే చలికాలంలో మరింత అందం, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!
1. ఉప్పు తక్కువ తీసుకోవడం :
ఉప్పు లేని వంట రుచించదు. అయినప్పుటికీ సాధారణంగా వాడే ఉప్పు కంటే చలికాలంలో తక్కువ మోతాదులో తీసుకోవడం ఆర్యోగానికి మేలు. ఈ కాలంలో చెమట ఎక్కువ పట్టక పోవడం వల్ల స్వేదం రూపంలో వెళ్లాల్సిన వ్యర్థ పదార్థాలు మన శరీరంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో తిష్ట వేసి కూర్చుంటాయి. ముఖ్యంగా కండరాలు, ఎముకలకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది.
2. వాటర్ ఎక్కువ తీసుకోవడం :
చాలా మంది దాహం లేదు కదా అని, వాటర్ తీసుకోరు. మరికొందరు తరుచూ యూరిన్వెళ్లవలసి వస్తుందని తక్కువ నీరు తాగుతుంటారు. దీనివల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోతుంది. చర్మం త్వరగా పోలుసుబారిపోతుంది. దాహం లేకున్నా తరుచుగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. నార్మల్వాటర్కంటే గోరువెచ్చని నీళ్లు తాగడం ఇంకా బెటర్.
3. వ్యాయామం చేయడం :
వ్యాయామం చేయడం అలవాటు లేకపోయినా చలికాలంలో మాత్రం తప్పక చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. చలి కాలంలో కండరాలు, కీళ్ళు, ఎముకలు, చాలా సెన్సిటివ్‌గా మారుతాయి. చలికి బిగిసుకుపోతుంటాయి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే కాస్త చెమట బయటకు పోతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
4. రాగి జావ తాగడం :
రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కండరాలు బలంగా మారడానికి తోడ్పడుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఉదయం ఒక గ్లాసు రాగి జావ తాగడం, లేదంటే రాగి సూప్వేడివేడిగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.
5. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ :
క్యారెట్‌లో చర్మాన్ని కాంతివంతంగా మార్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ఫేస్ గ్లో ఉండాలి అంటే క్యారెట్ తినడం కాని, క్యారెట్, బీట్రూట్ జ్యూస్తాగడం మేలు. శరీర భాగాలకు మేలు చేస్తూ బయటి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా జ్యూస్ తాగుతూ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.
ఈ ఐదు చిట్కాలు పాటిస్తూ చలికాలం సమస్యలకు చెక్‌పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.