ఎక్కువ వయసున్న మహిళలను పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఆ విషయంలో అసంతృప్తే..!

by sudharani |   ( Updated:2023-05-21 07:06:52.0  )
ఎక్కువ వయసున్న మహిళలను పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఆ విషయంలో అసంతృప్తే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు. అదేవిధంగా చాలా మంది మగవాళ్లు వయసులో తన కంటే పెద్ద ఏజ్ ఉన్న మహిళలను ఇష్టపడతారు. వారికి ఎట్రాక్ట్ అవుతారు. పెళ్లి చేసుకునేందుకు ముందుకొస్తారు. దీనికి కారణం వయసులో పెద్దవారికి ప్రతీ విషయాల్లో అనుభవం ఎక్కువ ఉంటుంది. అలాగే వారు ఆలోచించే విధానాలకు, వారి తెలివితేటలకు, లైంగిక పరిపక్వతకు మగవాళ్లు ఆకర్షితులవుతారు. అయితే.. మగవారి కంటే వయసులో పెద్ద అయిన మహిళలను పెళ్లి చేసుకోవడం వల్ల లాభాలతో పాటు నష్టాలు లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాం..

లాభాలు..

* వయసు ఎక్కువగా ఉన్న మహిళలకు ఏ విషయంలోనైనా ఫుల్ క్లారిటీ ఉంటుంది.

* రిలేషన్‌షిప్‌లో వారు ఏం కోరుకుంటున్నారు అనే దానికి ఒక అవగాహన వారికి క్షుణ్ణంగా ఉంటుంది.

* అంతేకాదు.. లైంగిక పరంగా కూడా వయసు ఎక్కువగా ఉన్నవారితో చాలా ఎంజాయ్ చేయగలుగుతారు.

* వీరు బెడ్‌పై సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

నష్టాలు..

* వయసు ఎక్కువగా ఉన్నవారితో డేటింగ్ చేస్తే సమాజంలో చిన్న చూపు ఉంటుంది. వారితో బయటకు వెళ్లినప్పుడు అందరూ చులకనగా చూస్తారు.

* వయసులో చిన్న వారితో పోల్చితే పెద్ద మహిళలకు కాస్త స్టామినా తక్కువగా ఉంటుంది. ఇది కొన్ని సార్లు మగవారికి ఇబ్బంది కరంగా మారుతుంది.

* అంతేకాకుండా మగవారి కంటే ఆడవారు వయసులో పెద్దయితే అన్నీ తమకే తెలుసునన్న భావనలో ఉంటారు. దీంతో మగవారిపై అజమాయిషీ చెలాయిస్తుంటారు.

Also Read...

ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. పడుకునేముందు ఈ డ్రింక్ తీసుకోండి

Advertisement

Next Story