- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IRCTC Tour Plan: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ మీ కోసమే!

దిశ, వెబ్ డెస్క్: ఎండకాలం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో సమ్మర్ హాలిడేస్ కూడా ప్రారంభంకానున్నాయి. దీంతో చాలా మంది టూర్లు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సూపర్ న్యూస్ చెప్పింది. 'గోవా డిలైట్' (Goa Delight) పేరుతో అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. దీంతో గోవా అందాలను మీ బడ్జెట్‌లో చూడొచ్చు.
ప్యాకేజీ వివరాలు
IRCTC గోవా డిలైట్ పేరుతో అందించే ఈ ప్యాకేజీలో మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లు గోవాలో ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి విమానంలో గోవా చేరుకుంటారు. స్థానిక ప్రదేశాలను విజిట్ చేసేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్యాకేజీ మార్చి 20 నుంచి ప్రారంభం కానుంది.
ప్యాకేజీ ధర
కంఫర్ట్ సింగిల్ షేరింగ్ అయితే, రూ.24,485, డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి రూ.20 వేలు, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి రూ.19,625గా ధరలు నిర్ణయించింది. 5 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ ధర రూ.15,885 ఉండగా విత్ అవుట్ బెడ్ రూ.15,510గా ఉంది. 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు రూ.8,450లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్యాకేజీలో సదుపాయాలు
* ప్రయాణ భీమా సదుపాయం
* ప్రయాణ సమయంలో ఐర్‌సీటీసీ ఎస్కార్ట్ సర్వీసులు
* విమాన ఛార్జీలు (హైదరాబానుంచి గోవాకి తిరిగి గోవా నుంచి హైదరాబాద్)
* మూడు రాత్రులు హోటల్‌లో వసతి సదుపాయం
* మూడు రోజులు ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం
* సైట్ సీయింగ్ కోసం వెహికల్ ఏర్పాటు
ప్యాకేజీలో లేని సౌకర్యాలు
* భోజనం, స్నాక్స్, వాటర్ గేమ్స్, ఇతర వ్యక్తిగత ఖర్చులు లాండ్రీ, టిప్స్ ప్యాకేజీ ద్వారా లభించవు.
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com విజిట్ చేసి ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
Read Also.. Save Water: సేవ్ వాటర్.. హోలీ ఒక్క రోజే కాదు.. 364 రోజులు!