- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
No Shave November : ఈ నెలలో చాలా మంది యువకులు గడ్డాలు గీసుకోరు..! కారణం ఇదే..
దిశ, ఫీచర్స్ : సాధారణంగానే కొందరు పురుషులు మొహంపై గడ్డాలు, మీసాలు లేకుండా క్లీన్‌గా షేవ్ చేసుకోవడం మనం చూస్తుంటాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ప్రొఫెషనల్ లుక్స్’ ట్రెండ్ కూడాను. వివిధ కార్పొరేట్ సంస్థల్లో, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వర్క్ చేసే ఉద్యోగుల్లోనూ అత్యధిక మంది క్లీన్ షేవ్‌తోనే కనిపిస్తుంటారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఏడాదంతా క్లీన్ షేవ్ చేసుకునే చాలామంది యువకులు ఒక్క నవంబర్ నెలలో మాత్రమే గడ్డాలతో కనిపిస్తుంటారు. అయితే అదేదో స్టైల్ కోసం మాత్రమే అనుకోనవసరం లేదు. దీనివెనుక ఓ సోషల్ రెస్సాన్సిబిలిటీ ఉంది. అదేంటో చూద్దాం.
నిజానికి ‘నో షేవ్ నవంబర్’ (No Shave November) అనేది ఒక థీమ్. దీని ప్రకారం ఈ నెలమొత్తం పురుషులు షేవింగ్, ట్రిమ్మింగ్, స్టైలిష్ గడ్డం, కటింగ్ వంటి వాటికోసం ఖర్చు చేసే డబ్బులను మిగిల్చాలి. వీటిని క్యాన్సర్ బాధితులను ఆదుకునే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలి. ఇంతకీ ఈ ట్రెండ్ ఎలా పుట్టుకొచ్చిందంటే.. అది 2007, అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే ఓ వ్యక్తి క్యాన్సర్‌తో పోరాడుతూ చివరికి కోలుకోకపోవడంవల్ల మరణించాడు. కాగా ఈ సందర్భంగా అతడి 8 మంది సంతానం తమ తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఈ బాధలోనే వారికో ఆలోచన కూడా తట్టింది.
తమ తండ్రి మరణానికి కారణమైన క్యాన్సర్ నివారణకు తమవంత కృషి, సహాయం చేయాలనుకున్నారు మాథ్యూ హిల్ కుమారులు. దీంతో పురుషుల్లో సంభవించే ప్రొస్టేట్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు, పరిశోధనా సంస్థలకు ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తమతోపాటు ప్రజలను, యువకులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలనుకున్నారు. అందుకోసం 2009లో ‘నో షేవ్ నవంబర్’ కాన్సెప్ట్ ప్రారంభించారు. క్యాన్సర్ నివారణపై పనిచేసే పరిశోధనలకు ఆర్థిక సాయం చేయాలని ప్రచారం మొదలు పెట్టారు. ఆ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.