- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలియన్స్‌ను గుర్తించే రోబోట్ స్నేక్ !
దిశ, ఫీచర్స్: కాలిఫోర్నియాలోని నాసా సైంటిస్టులు ప్రస్తుతం గ్రహాంతర వాసులను కనుగొనే ఉద్దేశంతో రోబోటిక్ స్నేక్‌ను డెవలప్ చేస్తున్నారు. ఎక్సోబయాలజీ ఎక్స్‌టాంట్ లైఫ్ సర్వేయర్ (EELS) సిస్టమ్ పేరుతో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL)లో మెరుగులు దిద్దుకుంటోంది. ఈ పొడవాటి రోబో స్నేక్ తన చక్రాల ఆధారంగా ప్రపంచపు భూభాగమంతా చుట్టుముట్టి వచ్చేలా డిజైన్ చేస్తున్నారు.
దాని ప్రాథమిక లక్ష్యం ఏంటంటే.. శని గ్రహంకు సంబంధించిన ఉపగ్రహం ఎన్సెలాడస్‌పై ఉన్న బిలాలను సందర్శించడం. భూభాగంపై ప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేసే ఈ రోబో స్నేక్.. తన జర్నీలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను సవాలు చేస్తూ నావిగేట్ చేస్తుంది. నాసా కాస్సిని అంతరిక్ష నౌక నుంచి వచ్చిన డేటా ఎన్సెలాడస్ దాని మంచు క్రస్ట్ క్రింద లిక్విడ్ సముద్రాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. చంద్రుని ఉపరితలం నుంచి విస్ఫోటనం చెందే ప్లూమ్స్ లిక్విడ్ వాటర్‌కు ప్రత్యక్ష మార్గాలుగా పనిచేస్తాయి. ఇది నివాసయోగ్యమైన లిక్విడ్ ఓషన్‌కు సులభమైన మార్గాన్ని అందిస్తుంది.
నీటిలో ఈదుకుంటూ వెళ్తుంది
ట్రెడీషనల్ రోవర్ వెహికల్స్ మాదిరిగా కాకుండా EELS పగుళ్లను క్రాల్ చేయడం ద్వారా, నీటిలో ఈదడం ద్వారా భిన్నమైన పరిసరాలను పరిశోధించగలుగుతుంది. సిస్టమ్ ట్రాక్స్, గ్రిప్పింగ్ మెకానిజమ్స్, నీటి అడుగున ప్రొపెల్లర్ యూనిట్‌లుగా పనిచేసే ఇన్నో వేటివ్ రొటేటింగ్ ప్రొపల్షన్ (వినూత్న భ్రమణ ప్రొపల్షన్) యూనిట్‌లను యూజ్ చేస్తుంది. ఇది రోబోట్‌ను ప్లూమ్ వెంట్ ఎగ్జిట్‌ను యాక్సెస్ చేయడానికి, సముద్రపు లోతుల్లోకి తిరిగి వెళ్లడానికి దోహదం చేస్తుంది.
ప్రాజెక్ట్ మేనేజర్ డామార్టిన్ రాబిన్సన్ చంద్ర లావా ఈ రోబో స్నేక్ ట్యూబ్‌లలోకి దిగి కూడా ఏదైనా ప్రదేశాన్ని అన్వేషించగలదని ఊహించాడు. సిస్టమ్ అనుకూలత ఇతర గమ్యస్థానాలకు అవకాశాలను కూడా మెరుగు పరుస్తుంది. మార్టిన్ పోలార్ క్యాప్స్, భూమికి సంబంధించిన మంచు పలకలలో పగుళ్లు వంటివని తెలిపాడు.
భిన్నమైన వాతావరణంలో..
గ్రహాలలోని భిన్నమైన అనలాగ్ వాతావరణంలో ఈఈఎల్‌ఎస్ సామర్థ్యాలను ప్రదర్శించగలుగుతుంది. అధిక ప్రభావితం కలిగిన భూ సంబంధమైన శాస్త్రీయ పరిశోధనలను గుర్తించడానికి జేపీఎల్ ప్రస్తుతం ఎర్త్ సైంటిస్టులకు సహకరిస్తుది. కెనడాలోని అథాబాస్కా హిమానీనదం, మౌంట్ మీగర్ అగ్నిపర్వతం లోపల దీని పనితీరును నిపుణులు పరీక్షించారు. ఇదొక అద్భుతమైన ముందడుగు అని డాక్టర్ మార్టిన్ రాబిన్ సన్ అన్నారు.
Also Read..