Mosquito liquid Effects: దోమలు కుడుతున్నాయని ఆ లిక్విడ్స్ వాడుతున్నారా..? కానీ..

by Javid Pasha |   ( Updated:2024-09-17 09:28:59.0  )
Mosquito liquid Effects: దోమలు కుడుతున్నాయని ఆ లిక్విడ్స్ వాడుతున్నారా..? కానీ..
X

దిశ, ఫీచర్స్ : దోమలు చిన్నవే.. కానీ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణం అవుతుంటాయి. కాబట్టి రాత్రిళ్లు అవి కుట్టకుండా మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. స్విచ్ బోర్డ్ ప్లగ్గింగ్స్‌కు అమర్చడం ద్వారా వాసన వెదజల్లుతూ దోమలను తరిమే కొన్నిరకాల పరికరాలను వాడుతుంటాం. అలాగే శరీరంపై లిక్విడ్స్ రాసుకుంటూ ఉంటాం.. కానీ ఇవన్నీ అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు. వాటిలో ఉండే హానికారక రసాయనాలకు గురికావడంవల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు

దోమలు కుట్టకుండా శరీరానికి అప్లయ్ చేసుకునే లిక్విడ్స్‌లో ప్రాలెథ్రిన్, అలెథ్రిన్ వంటి డేంజరస్ కెమికల్స్ ఉటాయి. వీటి వాసనకు గురికావడం వల్ల చర్మంపై, కళ్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా కళ్లల్లో మంట, చూపు మందగించడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద వంటివి వచ్చే చాన్స్ ఉంటుంది. దీంతోపాటు తలనొప్పి, మైకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో కిటికీలు, తలుపులు మూసి ఉంటాయి. కాబట్టి వెంటిలేషన్ లేని ఈ పరిస్థితిలో లిక్విడ్స్ వాసన మరింత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

నాడీ వ్యవస్థపై ప్రభావం

దోమల నుంచి రక్షణకోసం వాడే పరికరాలు, లిక్విడ్స్ నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. దీంతో చిరాకు, మానసిక, శారీరక అలసట, ఒత్తిడి వంటివి తలెత్తుతాయి. వాటిలోని రసాయనాలే ఇందుకు కారణం. ఇక పిల్లలు, వృద్ధులు తక్కువ ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉంటారు కాబట్టి మస్కిటో లిక్విడ్స్‌కు గురైతే అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం మరింత ఎక్కువ. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, దోమలకు ఆవాసంగా ఉండే నీటి గుంటలు తొలగించడం లేదా వాటిపై మూతలు ఉంచడం వంటి దోమల నివారణ చర్యలు పాటించాలి. అలాగే అవి అధికంగా ఉండే సీజన్‌లో సాయంకాలమే ఇంటి కిటికీలు, డోర్లు మూయడం, రాత్రిళ్లు దోమ తెరలు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More..

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. దీంతో ఇట్టే చెక్ పెట్టండి

Advertisement

Next Story