Mobile phone effect : మొబైల్ ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా?.. ఆ తర్వాత జరిగేది ఇదే !

by Javid Pasha |
Mobile phone effect : మొబైల్ ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా?.. ఆ తర్వాత జరిగేది ఇదే !
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. తమ తమ ఆసక్తిని, స్థోమతను బట్టి కొందరు నార్మల్ ఫోన్ వాడితే, మరి కొందరు స్మార్ట్ ఫోన్, ఇంకొందరు ఐ ఫోన్ వంటివి వాడుతుంటారు. మొత్తానికి మోస్ట్ పవర్ ఫుల్ కమ్యూనికేషన్ డివైస్‌గా మొబైల్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అదే సందర్భంలో సక్రమంగా వాడకపోతే పలు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవడంవల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* ఫోన్ ఆఫ్ చేయకుండా పక్కన పెట్టుకొని పడుకోవడంవల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దాని స్ర్కీన్ నుంచి వెలువడే బ్లూ లైటింగ్ శరీరంలో మొలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నిజానికి ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్. బ్లూ లైటింగ్ ప్రభావం కారణంగా ఇది తగ్గిపోవడంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి. దీంతో ఇతర అనారోగ్యాలకు కూడా సంభవించే అవకాశం పెరుగుతుంది.

* నైట్‌లో స్మార్ట్‌ ఫోన్ స్ర్కీన్‌ను ఎక్కువసేపు చూడటంవల్ల కళ్లల్లో నీరు కారడం, కళ్లు పొడిబారడం, దృష్టి లోపం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రాత్రిళ్లు తరచుగా రీల్స్ స్ర్కోల్ చేయడం, చూడటం, సమాచారం చదవడం వంటివి ఎక్కువసేపు కొనసాగిస్తూ ఉండటంవల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే రాత్రిపూట ఫోన్ చూసేవారిలో కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్‌లు కూడా పెరుగుతాయి.

* పక్కనే మొబైల్ పెట్టి నిద్రపోవడంవల్ల దాని నుంచి వెలువడే రేడియేషన్ హార్ట్ రేట్‌ను ప్రభావితం చేస్తుంది. రక్తపోటు పెరిగే చాన్స్ ఉంటుంది. క్రమంగా ఈ అలవాటు నిద్రలేమి, డయాబెటిస్ తద్వారా హృదయ నాళ సమస్యలు, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట పడుకోవడానికి కనీసం గంట రెండు గంటల ముందు మొబైల్ ఫోన్ చూడ కూడదని, దూరంగా పెట్టి పడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story