రైతు బంధు ఎఫెక్ట్.. పోలీసులకు దొరికిపోయిన మహేష్ బాబు (MEME OF THE DAY)

by Kavitha |   ( Updated:2024-01-04 10:15:56.0  )
రైతు బంధు ఎఫెక్ట్.. పోలీసులకు దొరికిపోయిన మహేష్ బాబు (MEME OF THE DAY)
X

దిశ, ఫీచర్స్ : ఏ విషయాన్ని అయినా క్షణాల్లో వైరల్ చేసే సత్తా సోషల్ మీడియాకు ఉంది. ప్రభుత్వ పథకాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు.. సీరియస్ ఇష్యూ నుంచి కామెడీ క్లిపింగ్స్ వరకు.. అన్నింటినీ సామాన్యులకు చేరువ చేసేస్తుంది. ఇక మీమ్స్ ఈ విషయాలనే సింపుల్ గా క్లారిటీతో ఐదు సెకన్లలో అర్థమయ్యేలా చేస్తాయి. ఈ క్రమంలోనే ఓ మీమ్ తెలంగాణ ప్రభుత్వ పథకం 'రైతు బంధు' గురించి వివరిస్తుంది. ఈ స్కీమ్ ఎంతగా సక్సెస్ అయింది? ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అనేది చెప్తుంది.

మహేష్ బాబు నటించిన 'అతడు' మూవీని యూజ్ చేస్తూ చేసిన మీమ్ ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది. ఎక్కడున్నావ్ అని ఓ పోలీస్ ఆఫీసర్ నిందితుడికి ఫోన్ చేస్తాడు.. నీకెందుకు అని ఆ వ్యక్తి రిప్లై ఇవ్వగా.. 'రైతుబంధు' పడిందా అని అతను ప్రశ్నిస్తాడు. ఇంకా పడలేదు అనగానే.. అయితే తెలంగాణలోనే ఉన్నావ్ అని కనిపెట్టేసాడు. మొత్తానికి ఈ పథకం నేరస్తులను కూడా పట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పకనే చెప్పిన మీమర్స్.. ఇంకా రైతులకు రైతు బంధు వెయ్యని కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్ గా వేసుకుంటున్నారు.




Next Story

Most Viewed