- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రా ఫిష్ వినియోగం హానికరం.. కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: రా ఫిష్‌ను(పచ్చి చేప) ఆహారంగా తీసుకోవడంవల్ల ఆస్తమా, కీళ్లనొప్పులు, డయాబెటిస్ మెల్లిటస్ వంటి సమస్యలు దూరం అవుతాయని మనదేశంలో చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణ భారతదేశం సహా ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఈ నమ్మకం ప్రబలంగా ఉంది. ముఖ్యంగా రా ఫిష్ గాల్ బ్లాడర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని, కేవలం మూఢ నమ్మకం మాత్రమేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. పైగా పచ్చి చేపలను మింగడం లేదా ఆహారంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి హానికరమని, మూత్ర పిండాల వైఫల్యానికి దారితీస్తుందని పరిశోధనలో తేలింది.
ఇటీవల రా ఫిష్ (Rawfish)గాల్ బ్లాడర్‌ను ఆహారంగా తీసుకున్న ఒక యువతి మూత్రపిండాల వాపుతో బాధపతుండటంపై నెఫ్రాలజీ విభాగానికి చెందిన ప్రముఖ వైద్యుడు ప్రొఫెసర్ ఎ.కె భల్లా పరిశోధనలు జరిపాడు. అందుకు రా ఫిష్ గాల్ బ్లాడర్‌లోని పైత్య రసమే కారణమని నిర్ధారించాడు. ఇది కిడ్నీల ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది వినియోగాన్ని పూర్తిగా నివారించాలని అతను సూచిస్తున్నాడు. ఎందుకంటే ఈ చేపల జీర్ణాశయంలో సహజంగానే అధిక స్థాయిలో పైత్య సరం ఉత్పత్తి అవుతుంది. ఇందులో సైప్రినాల్ (cyprinol) అనే టాక్సిన్ ఉంటుంది. మానవులలో కిడ్నీ వైఫల్యానికి ఇదే ప్రధాన కారణమని పరిశోధనలో తేలింది. అంతేకాదు పచ్చి చేపలను ఆహారంగా తీసుకున్న తర్వాత రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో తరచూ కడుపు నొప్పి, వాంతులు, యూరిన్ ఔట్‌పుట్ తగ్గడం వంటి లక్షణాలు కనబడతాయని, ట్రీట్‌మెంట్ అందకపోతే కిడ్నీ వైఫల్యానికి దారితీసి మరణం సంభవిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read...