- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్లప్పుడు 'చేతికి మొలిచిన పురుషాంగం'.. ఇప్పుడిలా చేశారు..?!
దిశ, వెబ్‌డెస్క్ః దేహంలో అవయవాలు ఉండాల్సిన చోట ఉండకపోతే, అందులోనూ బయటకు చెప్పుకోలేనివో, బయటకు కనిపించే అవయవాలో అయితే అది మరింత కష్టంగా ఉంటుంది. మాల్కం మెక్‌డొనాల్డ్ జీవితంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఆరేళ్ల క్రితం అతను దీర్ఘకాలం పాటు పెరినియం ఇన్‌ఫెక్షన్‌తో బాధపడ్డాడు. స్క్రోటమ్, పాయువులో ఇన్ఫెక్షన్ కారణంగా 2015లో తన పురుషాంగాన్ని తీసి, చేతికి పెట్టారు. అలా ఇప్పటి వరకూ చేతికి మొలిచిన పురుషాంగంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కున్న మెక్‌డొనాల్డ్‌కి ఇప్పుడు ఊరట దొరికింది.
నార్ఫోక్‌లోని థెట్‌ఫోర్డ్‌కు చెందిన 47 ఏళ్ల మెక్‌డొనాల్డ్ పురుషాంగం పోగొట్టుకోవడం వల్ల చాలా డిప్రెషన్‌కి లోనయినట్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. దానితో, దాదాపు మద్యానికి బానిసయ్యాడు. ఛానల్ 4లో 'ది మ్యాన్ విత్ ఎ పెనిస్ ఆన్ హిజ్ ఆర్మ్' డాక్యుమెంటరీలో తన జీవితం గురించి, తాను ఎదుర్కున్న మనోవేదన గురించి తెలియజేశాడు. బంధుమిత్రుల దగ్గర ఇబ్బందులు ఎదుర్కోవడం దగ్గర నుంచి, రోజువారీ పనుల్లో అది తనను ఎలా ఇబ్బంది పెట్టిందో వెల్లడించాడు. అయితే, ఇటీవల చేసిన తొమ్మిది గంటల ఆపరేషన్ తర్వాత తన పురుషాంగం తిరిగి సరైన స్థలంలో తిరిగి అమర్చారు వైద్యులు. దీనితో, అంతర్జాతీయంగా అతని గురించిన ఈ వార్త వైరల్ అయ్యింది. వినడానికి విచిత్రంగా తోచినా, అతని సాధారణ జీవితం తిరిగి రావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.