- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మానవ కండరాలతో నడిచే రోబోట్స్.. జపాన్ సైంటిస్టుల సరికొత్త సృష్టి
దిశ, ఫీచర్స్ : రియల్ హ్యూమన్ కాంపోనెంట్స్‌తో కూడిన రోబోట్స్ ‘స్టార్ ట్రెక్’ లేదా అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘బాటిల్‌స్టార్ గెలాక్టికా’లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ప్రస్తుతం జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మానవ కండరాల నుంచి సేకరించిన కణజాలాలతో నడిచే రోబోట్‌ను రూపొందించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. టెక్నాలజీని యూజ్ చేసి రోబోట్స్2ను రూపొందించడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ రోజుల్లో సాధారణమే. కానీ హ్యూమన్ మస్కల్ టిష్యూస్‌తో రూపొందించడమే ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎలా చేయగలిగారు?
తాము మానవ కణజాలాన్ని రోబోట్‌తో విలీనం చేయడం ద్వారా సైబోర్గ్ రోబోటిక్స్‌లో గణనీయమైన పురోగతిని సాధించామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పైగా ఆ కండరాలతో పవర్డ్ గేర్‌లను ఉపయోగించి నడవడానికి వీలు కల్పించారు. పరిశోధకులు ఈ రంగంలో ‘జెయింట్ లీప్’గా అభివర్ణించే ఈ పురోగతి, సిలికాన్ రబ్బర్‌తోపాటు, ల్యాబ్‌లో పెరిగిన అస్థిపంజర కండర కణజాలాలతో సాధ్యమైంది. వీటిని ఉపయోగించి నిర్మించిన రోబోట్‌ను రెండు కాళ్ల సైబోర్గ్ మానవ కదలికలను అనుకరించేలా ఫిక్స్ చేయబడ్డాయి.
మస్కల్ యాక్యుయేటర్స్
పరిశోధకులు కండర కణజాలాలను ఆర్టిఫిషియల్ పదార్థాలతో కలిపి బయో హైబ్రిడ్ రోబోట్స్‌ను రూపొందించడంపై వాస్తవానికి చాలా రోజులుగా ప్రయత్నించారు. ఈ వినూత్న విధానం మానవ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ, చక్కటి కదలిక సామర్థ్యాలను ప్రతిబింబిస్తూ, సాఫ్ట్ టచ్‌తో రోబోట్ సమర్థవంతంగా, నిశ్శబ్దంగా కదలడానికి అనుమతిస్తుందని ప్రస్తుతం నిరూపించారు. ‘బయాలజీ అండ్ మెకానిక్స్ కలయిక అయిన బయోహైబ్రిడ్ రోబోట్స్‌పై పరిశోధన ఇటీవల బయోలాజికల్ ఫంక్షన్స్‌ను కలిగి ఉన్న రోబోటిక్స్ యొక్క న్యూ ఫీల్డ్ దృష్టిని ఆకర్షిస్తు్న్నాయని పరిశోధకుడు డాక్టర్ షోజీ టేకుచి తెలిపారు. ‘కండరాన్ని యాక్యుయేటర్స్‌గా ఉపయోగించడం వల్ల ఒక కాంపాక్ట్ రోబోట్స్‌ను రూపొందించవచ్చు. సాఫ్ట్ టచ్‌తో సమర్థవంతమైన, సైలెంట్ మూవ్‌మెంట్ కదలికలను సాధించవచ్చు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
విద్యుత్ ప్రేరణతో కదలిక
కొత్తగా రూపొందించిన రోబోట్ హెయిర్ యొక్క క్రియేషన్ నీటి అడుగు భాగంలో కూడా నడవడానికి అనుగుణంగా ఉంటుంది. దాని ఫోమ్ బోయ్ టాప్, బరువైన కాళ్లు, కండరాల కదలికలకు ప్రతిస్పందనగా బెండ్ అయ్యే సిలికాన్ రబ్బరు అస్థిపంజరానికి అమర్చబడటం అద్భుతంగా ఉంది. రోబోట్ యొక్క కదలిక ల్యాబ్‌లో డెవలప్ చేసిన అస్థిపంజర కండర కణజాలం దాని కాళ్ళకు జోడించబడి ఉంటుంది. ఇది ఎలక్ర్టిసిటీతో ప్రేరేపించబడినప్పుడు నడక ప్రారంభిస్తుంది. ప్రతి ఐదు సెకన్లకు ఎడమ, కుడి కాలు మధ్య విద్యుత్ ప్రేరణలను ప్రత్యామ్నాయంగా మార్చడం ద్వారా ఈ సరికొత్త రోబోట్ నిమిషానికి 5.4 మిమీ లేదా గంటకు 0.002 మైళ్ల వేగంతో నడవగలదు. టర్నింగ్‌ని ఎనేబుల్ చేయడానికి, పరిశోధకులు బృందం కుడి కాలును పదే పదే యాక్టివేట్ చేసింది. ఎడమ కాలు యాంకర్‌గా పనిచేసి, 62 సెకన్లలో 90-డిగ్రీల మలుపును సాధించింది.