- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాసన పసిగట్టే రోబో.. త్వరలో అందుబాటులోకి
దిశ, ఫీచర్స్: పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, నేరస్తులను గుర్తించడానికి పోలీసులు, ఇన్వెస్టిగేషన్ నిపుణులు డాగ్ స్క్వాడ్‌ను యూజ్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. కానీ ఇక నుంచి నిజమైన కుక్కలు కాకుండా ఆధునిక టెక్నాలజీ ద్వారా వాసన పసిగట్టే రోబోటిక్‌ను ఇజ్రాయెల్ సైంటిస్టులు రూపొందించారు.
త్వరలో ఆ దేశంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో డ్రగ్స్ స్నిఫింగ్ రోబోటిక్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆ దేశంలోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం బయోలాజికల్ సెన్సార్‌ను ఉపయోగించి ఈ విధమైన సాంకేతిక పురోగతిని డెవలప్ చేయడం ప్రపపంచంలోనే మొట్టమొదటి సారి కాగా.. ఈ సెన్సార్ సమీపంలోని వాసనకు ప్రతిస్పందనగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను పంపడం ద్వారా పని చేస్తుంది.
ప్రారంభ దశలోనే పరిశోధకులు బయోలాజికల్ సెన్సార్‌ను ఎలక్ట్రానిక్ సిస్టమ్‌కు విజయవంతంగా కనెక్ట్ చేయగలిగారు. తర్వాత మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ని ఉపయోగించి సాధారణంగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం కంటే 10 వేల రెట్లు ఎక్కువ సెన్సిటివిటీతో వాసనలను కరెక్టుగా గుర్తించగలిగారు.
ఈ విజయవంతమైన ట్రయల్స్ ద్వారా భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, వ్యాధులుతోపాటు మరిన్నింటిని గుర్తించడంలో ఈ టెక్నాలజీ సహాయపడుతుందని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన టీమ్‌కు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన సగోల్ స్కూల్ ఆఫ్ న్యూరోసైన్స్ డాక్టరల్ స్టూడెంట్ నేతా ష్విల్ నాయకత్వం వహించాడు.
‘‘మ్యాన్ మేడ్ టెక్నాలజీస్ ఇప్పటి వరకైతే వాసన పసిగట్టడంలో జంతు ప్రపంచానికి పోటీ పడలేదు. అందుకు చక్కటి ఉదాహరణ విమానాశ్రయంలో చూడవచ్చు. ఇక్కడికి మనం మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే మాగ్నెటోమీటర్ ద్వారా తనిఖీ చేయబడి వెళ్తాం. మనం ఏదైనా మెటల్ పరికరాలను తీసుకువెళ్తున్నది కూడా ఆ మాగ్నోమీటర్ గుర్తిస్తుంది. కానీ ఒక ప్రయాణికుడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడో లేదో తనిఖీ చేయాలనుకున్నప్పుడు మాత్రం అది పనిచేయదు. కాబట్టి పసిగట్టడానికి డాగ్‌ను తీసుకువస్తారు.
జంతు ప్రపంచంలో కీటకాలు ఇంద్రియ సంకేతాలను స్వీకరించడంలో, ప్రాసెస్ చేయడంలో గొప్పగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక దోమ గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలో 0.01 శాతం వ్యత్యాసాన్ని కూడా గుర్తించగలదు. కానీ నేడు మనం అటువంటి టెక్నాలజీ సెన్సార్‌లను ఉత్పత్తి చేయడానికి మాత్రం దూరంగా ఉంటున్నాం. అయితే తాజాగా వాసనను పసిగట్టే రోబోటిక్‌ను కనుగొనడం ద్వారా జంతువులు, కీటకాల గ్రహణ శక్తికి దగ్గరయ్యాం’’ అంటున్నారు అయాలీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మావోజ్.
మన ఇంద్రియాలు (కళ్ళు, చెవులు, ముక్కు), అలాగే అన్ని ఇతర జంతువులు వివిధ సంకేతాలను గుర్తించడానికి, వాటి మధ్య తేడాను గుర్తించడానికి గ్రాహకాలను ఉపయోగిస్తాయని అధ్యయన కర్తలు వెల్లడించారు. ఉదాహరణకు ముక్కు వాసన పసిగట్టగానే సంబంధిత సమాచారాన్ని ఎలక్ర్టిక్ సిగ్నల్స్‌గా అనువదిస్తుంది.
మెదడు దానిని సమాచారంగా డీకోడ్ చేస్తుంది. బయోసెన్సార్ల విషయానికి వస్తే పెద్ద సవాలు ఏంటంటే.. ముక్కు వంటి ఒక అవయవాన్ని టెక్నాలజీ పరంగా తయారు చేసి, ఎలక్ట్రానిక్ సిస్టమ్‌కి అనుసంధానించడం. తాజాగా వాసన పసిగట్టే రోబోటిక్ తయారు చేసేందుకు ఇజ్రాయెల్ పరిశోధకుల బృందం ఇలాగే చేసింది.