Sleeping : నోరు తెరిచి నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Jakkula Samataha |
Sleeping : నోరు తెరిచి నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్ : కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక వ్యక్తి కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవాలి అంటారు నిపుణులు. అయితే కొంత మంది పలు సమస్యల వల్ల సరిగ్గా నిద్ర పోరు. ముఖ్యంగా కొందరికి నిద్రలో సగం కళ్ళు తెరిచి నిద్రపోవడం, మరికొందరు గురక సమస్య, ఇంకొందరు నోరు తెరిచి నిద్రపోవడం జరుగుతుంది. అయితే ఇలా నోరు తెరిచి నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. దాని వలన అనేక సమస్యలు ఏర్పడుతాయంట. కాగా, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • నోరు తెరిచి నిద్ర పోవడం వలన రాత్రి సమయంలో శ్వాస సరిగ్గా తీసుకోలేక ఇబ్బందులు పడతారు.
  • నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది
  • నోరు తెరిచి నిద్రపోవడం వలన అధిక రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
  • నోరు తెరిచి నిద్ర పోవడం తలనొప్పి, మెదడులో వాపుకు కారణం కావచ్చు
  • ఆక్సిజన్ తీసుకోవడంలో నోటి శ్వాస కష్టతరం చేస్తుంది
  • నోరు తెరిచి నిద్రపోవడం వలన శ్వాసలో ఇబ్బందులు ఏర్పడతాయి.
  • పెద్దలలో నోరు పొడిబారడం, గొంతు నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి
  • ఉదయం నీరసం, అలసట ఎక్కువగా ఉంటుంది.

(నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed