నిద్రలో ఛాతీపై దెయ్యం కూర్చున్నట్లు అనిపిస్తోందా.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు?

by Disha Web Desk 7 |
నిద్రలో ఛాతీపై దెయ్యం కూర్చున్నట్లు అనిపిస్తోందా.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు?
X

దిశ, ఫీచర్స్: చాలా మందికి పడుకున్నప్పుడు సడెన్‌గా మెలుకువ వచ్చేస్తుంది. ఒళ్లంత చెమటలు పట్టినట్లు.. ఎవరో గుండెలపై కూర్చున్నట్లు భారంగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా తమ బాడీని కదపలేకపోవడం, గట్టిగా అరుద్దామన్నా నోటి నుంచి మాట రాకపోవడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని చాలా మంది దెయ్యం పడింది అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక పెద్ద అనారోగ్య సమస్య ఉందని ఎవరూ ఊహించి ఉండరు. అవును మీరు విన్నది నిజమే.

గుండెలపై ఎవరో కూర్చున్నట్లు, ఛాతిపై భారంగా ఉండి చెమటలు పట్టడం వంటి ఫీలింగ్స్ ఉంటే అది ‘స్లీప్ పెరాలసిస్’ అనే వ్యాధి ఉన్నట్లు అంట. ఈ వ్యాధి బాగా నిద్రలో ఉన్నప్పుడు సంభవిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది ఎక్కువ అలసట ఉండి, శరీరం బాగా అలసిపోయినప్పుడు నిద్ర పోతారు. అటువంటి సమయాల్లో ‘స్లీప్ పెరాలసిస్’ అనేది వస్తుందట. ఆ సమయంలో మన చెవులకు కొన్ని శబ్ధాలు వినిపిస్తాయి కానీ, వాటికి మనం ఆన్సర్ చెయ్యలేం.. శరీరాన్ని కదపలేమని చెబుతున్నారు.

అయితే.. ఈ వ్యాధి రావడానికి గల అసలైన కారణాలు సరైన నిద్ర లేకపోడం, మానసిక ఒత్తిడి, బలహీనత. అందుకే ‘స్లీప్ పెరాలసిస్’ నుంచి కాస్త ఉపసమనం పొందాలంటే.. 7 నుంచి 8ల గంటల నిద్ర చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా.. ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యాయామం చెయ్యడం, మంచి ఆహారం ఇవన్ని సరిగ్గా ఉంటే ఈ వ్యాధి నుంచి తప్పించుకోవట.



Next Story

Most Viewed