చలి అన్నం తినడం ప్రమాదకరమా? నిజానిజాలు తెలుసుకుందాం..

by Sujitha Rachapalli |   ( Updated:2025-02-17 15:52:26.0  )
చలి అన్నం తినడం ప్రమాదకరమా? నిజానిజాలు తెలుసుకుందాం..
X

దిశ, ఫీచర్స్ : అన్నం.. ఆకలి విషయంలో పూర్తి సంతృప్తిని అందించే కంఫర్ట్ ఫుడ్. ఇందులోని ప్రత్యేక గుణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. సెన్సిటివ్ స్టమక్ ఉన్న వారికి బెస్ట్ చాయిస్‌గా ఉన్నరైస్ .. జీర్ణం కావడం సులభం. కాగా ఇందులో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇతర ఆహారాలతో పోలిస్తే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉంటుంది. ఈ అనుకూలతల కారణంగానే గ్లోబల్ ఫేవరేట్ అయిపోయింది. అయితే ఇన్ని ప్రయోజనాలున్నా.. ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. అదే చలి అన్నం(Cold Rice) తినడం ఆరోగ్యకరమేనా? ఇందుకోసం సమాధానం వెతుకుతున్నట్లయితే.. మీరు కరెక్ట్ ప్లేస్‌కు వచ్చినట్లే.

*కూలెంట్

కోల్డ్ రైస్ తినడం శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుందని చెప్తున్నారు నిపుణులు. బాడీలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని, హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుందని వివరిస్తున్నారు.

* గ్యాస్, ఉబ్బరం

చలి అన్నం తినడం వల్ల నెగెటివ్ ఎఫెక్ట్ ఉండవచ్చు. ఎందుకంటే ఇది గ్యాస్, ఉబ్బరం పెరగడానికి దారితీస్తుంది. చల్లని ఉష్ణోగ్రత జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అదనంగా కోల్డ్ రైస్‌లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ కొంతమందికి జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

* బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్

కోల్డ్ రైస్ తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దాని అధిక రెసిస్టెంట్ స్టార్చ్ రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేయడం ద్వారా.. రెసిస్టెంట్ స్టార్చ్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

* ఫుడ్ పాయిజనింగ్

మిగిలిన అన్నం తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా కావచ్చు. ముఖ్యంగా అన్నంలో సాధారణంగా కనిపించే బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా.. వండిన అన్నంలో వేగంగా పెరగగలదు. ఫుడ్ పాయిజనింగ్, వికారం, వాంతులు కలుగుతాయి.

Next Story

Most Viewed