Insomnia: పిల్లల్లోనూ నిద్రలేమి.. ‘డిజిటల్ ఏజ్’ ఎఫెక్టే కారణమా?

by Javid Pasha |
Insomnia: పిల్లల్లోనూ నిద్రలేమి.. ‘డిజిటల్ ఏజ్’ ఎఫెక్టే కారణమా?
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పెద్దలు మాత్రమే నిద్రలేమి సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్, మానసిక ఒత్తిళ్లు, వివిధ అనారోగ్యాలు ఇందుకు కారణం అవుతుంటాయి. కానీ ఈ మద్య పిల్లలు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కేసులు నమోదువుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇందుకు కారణం నేటి డిజిటల్ యుగమే అంటున్నారు. ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్‌లు, స్ర్కీన్లకు అతుక్కుపోవడం ఈ సమస్యను పెంచుతున్నట్లు పలు అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి.

నిద్ర నాణ్యతపై ప్రభావం

బాల్యంలో నాణ్యమైన నిద్ర చాలా అవసరం. ఇది పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. శారీరక ఎదుగుదలకు దోహదం చేస్తుంది. కానీ డిజిటల్ పరికరాలకు ఎక్కువ సమయం కేటాయించడంవల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీస్, అలాగే క్వాలిటీ స్లీప్ తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గాడ్జెట్స్ వాడకం నిద్రలేమికి లేదా క్వాలిటీ స్లీప్ లేకపోవడానికి దారితీస్తోంది. అలాగని డిజిటల్ టెక్నాలజీ మొత్తానికే నష్టం చేస్తుందని కాదు, దానిని లిమిట్‌కు మించి ఉపయోగించుకోవడంవల్లే అసలు సమస్య అంటున్నారు.

సిర్కాడియన్ రిథమ్‌పై ప్రభావం

డిజిటల్ టెక్నాలజీ పిల్లపై పలు రకాలుగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత లేదా రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లలో నిమగ్నం అయి వీడియో గేమ్స్‌లో మునిగిపోయే పిల్లలు బ్లూ లైటింగ్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. ఇది వారికళ్లపై, మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతోంది. సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తోంది.

పరిష్కారం ఏమిటి?

పిల్లల్లో క్వాలిటీ స్లీప్‌ను దెబ్బతీస్తున్న డిజిటల్ పరికరాలు వారికి ఎక్కువగా అందుబాటులో ఉంచకపోవడమే మొట్టమొదటి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ పిల్లల చదువులకోసం వాటిని యూజ్ చేయాల్సి వస్తే లిమిటెడ్‌గా వాడటం వల్ల మాత్రమే పిల్లల్లో నిద్రలేమి, తద్వారా తలెత్తే ఇతర శారీర, మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే పౌష్టికాహారం, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా పిల్లల్లో లెర్నింగ్ అండ్ మెమోరీ పవర్‌ను, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌ను మెరుగు పరుస్తాయని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed