- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భిక్షాటనకు డిజిటల్ పేమెంట్స్.. ప్రధానే స్ఫూర్తి!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మనం డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. చాలా వరకు రిలేషన్స్‌తో పాటు వ్యాపార లావాదేవీలు ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. ఇక రెండేళ్లుగా వెంటాడుతున్న పాండమిక్ పరిస్థితులు ఈ తరహా సేవలను అనివార్యం చేయగా.. ప్రతి రంగం ఈ మార్పును ఆహ్వానించక తప్పలేదు. ఇదే క్రమంలో బిహార్‌లోని బిక్షగాడు సైతం డిజిటల్ పేమెంట్స్ అంగీకరిస్తూ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. బిలియనీర్ నుంచి బెగ్గర్ వరకు ఎవరైనా సరే టెక్నాలజీ వరల్డ్‌లో నిలదొక్కుకోవాలంటే మారాల్సిందేనని నిరూపిస్తున్నాడు.
బెట్టియా రైల్వే స్టేషన్‌లో 40 ఏళ్ల రాజు పటేల్.. తన మెడలో QR కోడ్ ప్లకార్డ్, చేతిలో డిజిటల్ టాబ్లెట్‌తో భిక్షమెత్తుకుంటున్నాడు. చాలా కాలంగా ఇదే వృత్తిలో ఉన్న రాజు, ప్రస్తుతం తనకు భిక్షం వేయాలనుకున్న వారికి డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ కల్పించాడు. ఈ అప్‌డేట్ గురించి ఓ ప్రముఖ సంస్థకు వివరించిన రాజు.. 'నా చిన్నప్పటి నుంచి ఇక్కడే అడుక్కుంటున్నాను. కానీ ఈ డిజిటల్ యుగంలో బెగ్గింగ్ స్టైల్ మార్చాను. చాలాసార్లు చిల్లర లేదనే కారణంతో ప్రయాణికులు దానం చేసేందుకు నిరాకరించారు. ఫోన్ పే తదితర ఈ-వాలెట్లను విరివిగా వాడుతున్న కాలంలో నగదును జేబుల్లో క్యారీ చేయడం లేదని కూడా పలువురు తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకే నేను బ్యాంక్ ఖాతా తెరవడంతో పాటు ఈ-వాలెట్ క్రియేట్ చేసుకున్నాను' అని పేర్కొన్నాడు.
ఇక బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఫాలోవర్‌గా చెప్పుకునే రాజు.. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా ప్రచారం నుంచి ప్రేరణ పొందినట్టు చెప్పాడు. ప్రధాని 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమాన్ని తప్పకుండా వింటానని వెల్లడించాడు. అయితే రాజు ఇనీషియేటివ్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్న నెటిజన్లు.. భారత్‌లో ఇంకా చాలా మంది జీవనోపాధి కోసం భిక్షమెత్తుకునే పరిస్థితులే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇండియాలోని 'ఫస్ట్ డిజిటల్ బెగ్గర్' తనేనేమో అని మరికొందరు అంటున్నారు.
https://twitter.com/PostSuspension1/status/1490955938937077762?s=20&t=4Je136k6NBolRiRmX1rLnA