- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kidney Health : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? కిడ్నీలు డ్యామేజ్ అయినట్టే!

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. అలాంటి వాటిలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరం నుంచి వ్యర్థాలను తొలగించి మూత్రం ద్వారా బయటకు పంపించడంలో కీ రోల్ పోషిస్తాయి. ప్రతీ నిమిషం అరకప్పు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కిడ్నీ హెల్త్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు. అయితే కిడ్నీల పనితీరు సరిగ్గా లేనప్పుడో, అవి డ్యామేజ్ అయ్యే సూచనలు ఉన్నప్పుడో ఎలా గుర్తించాలి? బయటకు కనిపించే లక్షణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
యూరిన్‌లో నురగ
ఉదయం నిద్రలేచిన తర్వాత మీ యూరినేషన్ టైమ్‌లో నురగ ఎక్కువగా కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదనడానికి ఇదో సంకేతం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పరిస్థితినే ‘ప్రొటీన్యూరియా’ అంటారు. అంటే కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు లేదా ప్రొటీన్ లీక్ అయి మూత్రంలో కలిసినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
ముఖంలో వాపు
ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ, తరచుగా ఉదయంపూట ముఖంలో వాపు కనిపిస్తుంటే జర జాగ్రత్త పడాల్సిందే. కిడ్నీల్లో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అట్లనే కళ్ల చుట్టూ వాపు కూడా కనిపిస్తుంది. కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో విఫలమైనా, వాటి పనితీరు నెమ్మదించినా బాడీలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ తప్పి ఇలా జరగవచ్చు. కొన్నిసార్లు కాళ్లు, చేతుల్లోనూ వాపు కనిపిస్తుంది.
అలసట, శారీరక బలహీనత
కొన్ని వారాల పాటు ఉదయం లేవగానే అధిక అలసట, శారీరక బలహీనత వేధిస్తుంటే అది మీ కిడ్నీ సమస్యల వల్ల కూడా కావచ్చు. మూత్రపిండాల ఫంక్షనింగ్ సక్రమంగా లేకపోతే ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిస్థితి క్రమంగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అంటే రక్తంలో మలినాలు పోరుకుపోయి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఏర్పడవచ్చు.
నోటి దుర్వాసన
ఉదయం పూట నోటి దుర్వాసన మరీ అధికంగా ఉండటం, అమ్మోనియా లాంటి వాసన రావడం కూడా కిడ్నీల పనితీరు మందగించింది అనడానికి సంకేతం. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడబోయడంలో విఫలం చెందినప్పుడు ‘యురేమిక్ బ్రెత్’ అనే పరిస్థితి ఏర్పడటంవల్ల ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పాటించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.