విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి?.. ICAO చెప్తున్నదిదే !

by Prasanna |
విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి?.. ICAO చెప్తున్నదిదే !
X

దిశ, ఫీచర్స్: మీకీ విషయం తెలుసా?.. 91 దేశాలలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం

వరల్డ్ వైడ్‌గా రోజుకు కొన్ని పక్షులు విమానాలకు తాగడంవల్ల చనిపోతున్నాయట. కనీసం 34 ప్రమాదాలు పక్షులు, విమానాలు పరస్పరం ఢీకొనడంవల్ల జరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌ప్లేన్ లేదా హెలికాప్టర్ ఆకాశంలో ఎగురుతున్నపుడు పక్షులు అడ్డుపడితే విమానంలో ఉన్నవారికి రిస్క్ ఎదురైనట్లేనని చెప్తుంటారు. ఇలాంటి సంఘటనల గురించి కూడా మనం చాలా వింటుంటాం. అయితే ఎందుకలా జరుగుతుంది? పక్షులు విమానాలపై ఎందుకు దాడి చేస్తాయి? అనే సందేహాలు మాత్రం ఇప్పటికీ చాలామందిని వెంటాడుతున్నాయి.

వాస్తవానికి పక్షి జాతులు తాము నివసిస్తున్న భూభాగాన్ని, అదే విధంగా ఆకాశంలో ఎగురుతున్న సందర్భంలో తామున్న ప్రదేశంలోకి ఇతర చొరబాట్లను సహించని స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఇతర జాతులకు సంబంధించిన ఆనవాళ్లను అవి గమనిస్తే తిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు కాకులు గుంపును పరిశీలిస్తే గనుక, అవి వాటి పరిసరాల్లోకి ఇతర పక్షి జాతులు చొరబడితే వాటిని తరిమేదాకా ఊరుకోవు. పైగా గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. అలాగే ఆకాశంలో విహరిస్తున్నప్పుడు వివిధ రకాల పక్షులు కూడా ఇలాగే భావిస్తాయట. తాము ఎగురుతున్న మార్గంలోకి శత్రువు వస్తున్నాడనే అనుమానంతో విమానంపై గుంపులుగా దాడిచేసేందుకు ట్రై చేస్తాయి. దీంతో నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే పక్షులవల్ల జరిగే అన్ని ప్రమాదాలు పెద్ద రిస్కును కలిగించవని, 92 శాతం పక్షులు-విమానాలను గుద్దుకోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగదని ICAO పేర్కొంటున్నది. కేవలం 8 శాతం మాత్రమే ప్రమాదాకుల అవకాశం ఉందని చెప్తోంది. అయినప్పటికీ ఇటీవల విమానయాన సంస్థలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇంజిన్‌ను పక్షులు ఢీ కొట్టకుండా ఉండటానికి, ఆ భాగంలో వింత శబ్దాలు వచ్చే డివైస్‌లను ఏర్పాటు చేస్తు్న్నాయి. విమానాల రంగులు కూడా పక్షులను అట్రాక్ట్ చేసేవి కాకుండా, ఆకాశంలో కలిసిపోయే కలర్స్‌ను యూజ్ చేస్తున్నారు. దీంతో ఈ మధ్య విమానాలపై పక్షులు దాడిచేసే సంఘటనలు బాగా తగ్గిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed