- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సండే స్పెషల్ :స్పైసీ స్పైసీ రోస్టెడ్ చికెన్ ఫ్రై.. ఇలా తయారు చేయండి!
దిశ, ఫీచర్స్ : సండే వచ్చిందంటే చాలు చాలా మంది స్పైసీ స్పైసీగా చికెన్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇంకొంత మంది రెస్టారెంట్‌కు వెళ్లి రోస్టెడ్ చికెన్ తింటుంటారు. అయితే రెస్టారెంట్‌కు వెళ్లకుండా రోస్టెడ్ చికెన్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్
శనిగపిండి
కారం
ఉప్పు
గరం మసాలా
చికెన్ మసాల
అల్లం వెళ్లుల్లి పేస్ట్
ఉల్లిగడ్డలు
కొత్తిమీర
కరివేపాకు
నూనె
తయారీ విధానం
ముందుగా ఓ బౌల్ తీసుకొని, అందులో చిన్నగా తరిగిన చికెన్ ముక్కలను తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ కారం, చికెన్ మసాల, గరం మసాల, ఉప్పు, కారం, వన్ టేబుల్ స్పూన్ శనిగపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె పోసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను, నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత మరో కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా తరిగిన ఆనియన్‌ను నూనెలో వేయించాలి, తర్వాత అల్లం వెళ్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. అవి వేగాక, నూనెలో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కడాయిలో వేసి కలపాలి. అంతే వేడి వేడిగా చికెన్ రోస్ట్ రెడీ.మరి ఇంకెందుకు లేటు.. సండే స్పెషల్ స్పైసీ చికెన్ రోస్ట్ టేస్ట్ చేయండి.