- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోనే మ్యాంగో పాపడ్ తయారీ విధానం.. ఎలాగో చూద్దామా..
దిశ, ఫీచర్స్ : వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లు మామిడిపండ్లు. ఎంతో రుచికరమైన ఈ మామిడిని కొంతమంది ముక్కలుగా కోసి తింటే మరికొంతమంది మంచి జ్యూస్ చేసుకుని తాగుతారు. అలాగే ఇప్పుడు మనం మామిడితో తయారయ్యే రుచికరమైన మరోకొత్త రెసిపీని తెలుసుకుందాం. అదే మామిడి పాపడ్. ఎంతో రుచిగా ఉండే దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు దీన్ని పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మరి ఆ మామిడికాయ పాపడ్ ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
పండిన మామిడి పండ్లు : 2 - 3
చక్కెర: 1 కప్పు (రుచికి సరిపడా )
నిమ్మరసం : 1 tsp
తయారీ విధానం..
ముందుగా పండిన మామిడి పండ్లను కడిగి తొక్క తీసి గుజ్జును తీయాలి.
మామిడికాయ గుజ్జును మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి.
ఆ తరువాత ఓ మందమైన పాన్ తీసుకుని అందులో ఈ మ్యాంగో ప్యూరీని పోసి తక్కువ మంట పై ఉడికించాలి.
కాసేపటికి ప్యూరీలో చక్కెర, నిమ్మరసం వేసి చిక్కపడేలా చూస్తూ అడుగు మాడకుండా కలపాలి.
మిశ్రమం పూర్తిగా చిక్కగా అయ్యాక గ్యాస్‌ను ఆపివేయండి.
ఆ తర్వాత ఓ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి లేదా నూనె రాయండి.
సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్ లో పోసి ఓ సన్నని పొరలా చేసి ఎండలో ఉంచి ఆరనివ్వాలి.
పూర్తిగా ఆరిపోయాక ప్లేట్ నుంచి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే మామిడి పాపడ్ తయారైనట్టే.