- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Self Love challenge:30 డేస్‌లో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలా సాధ్యమవుతుంది.. ఈ చాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా?
దిశ, ఫీచర్స్: ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం అనేది సర్వసాధారణం. అనగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పాఠశాలలోని ఉపాధ్యాయుల్ని.. ఇలా ఎవరైనా మనతో కాస్త క్లోజ్‌గా ఉన్నా, హెల్ప్ చేసినా వారిపై మనకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కొంతమంది చేసిన సహాయాన్ని మర్చిపోతే మరికొంతమంది జీవితాంతం గుర్తు ఉంచుకుంటారు. అయితే ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం చాలా సులభం కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రేమించుకున్నారా? ఇప్పటివరకు ఇది ఫాలో కానీ వారు ఇకపై 30 రోజుల్లో సెల్ఫ్ లవ్ చాలెంజ్ చేసుకోండి. మీలో మీకే అనేక మార్పులు కనిపిస్తాయి. ఇందుకోసం ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ఎలాగో ఇప్పుడు చూద్దాం..
* మొదటిరోజు ముందుగా మీకు నచ్చిన పది విషయాలు ఒక బుక్‌లో రాసుకోండి.
* ప్రతి రోజు వాకింగ్ చేయండి.
* ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మీకు నచ్చిన పాటలు వినండి.
* మీకు ఎప్పుడైనా సహాయం చేసివారుంటే..వారిని గుర్తు చేసుకోండి. వెంటనే మీలో మంచి ఆలోచనలు, ఎదుటి వారికి సహాయం చేయాలనే థాట్ వస్తుంది.
* ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అలా బయటకు వెళ్లండి.
* రోజంతా ఫోన్ ఉపయోగించకుండా మీతో మీరే టైమ్ స్పెండ్ చేయండి.
* మీకు నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ చేసుకుని తినండి.
* ముఖ్యంగా మీకు మీరే ఒక ప్రేమ లేఖ రాసుకోండి.
* మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో మీ గోల్స్ ఒక పేపర్ పై రాసుకోని, దాన్ని మీరు రోజు చూసుకునే అద్దానికి అతికించండి.
* ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. భోజనం, అవసరమైన వస్తువులు దానం చేయండి.
*లైబ్రరీకి వెళ్లి బుక్స్ చదవండి.
* ఒక రోజంతా ప్రకృతిలో గడపండి. ఉదా: పార్క్
* మీరు వేటి కారణంగా హ్యాపీగా ఉంటారో అవి బుక్ లో రాసుకోండి.
* ప్రశాంతంగా భోజనం తినండి.
* ఇంట్లోని బట్టలు, నగలు చక్కగా సర్దండి.
* ఒక రోజంతా మీకు నచ్చిన బొమ్మల్ని డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వేయండి.
* ఒక రోజు మీ అందంపై దృష్టి పెట్టండి. ఫేషియల్, హెయిర్ కట్, బాడీ మసాజ్ ఇలా ఏవైనా చేయించుకోండి.
* మీరు ఒక్కరే థియేటర్ కు వెళ్లి మూవీ చూడండి.
* ఒక రోజు మొత్తం ఏ పని చేయొద్దు.
* మీ ఫేవరేట్ డ్రెస్ వేసుకోండి.
* ఒక రోజు దేనికి భయపడకుండా మీకు ఇష్టమైన పనులు చేయండి.
* తర్వాత రోజు మీరు దేనికి భయపడుతున్నారు, దేన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు తెలుసుకోండి.
* తొందరగా పడుకుని మార్నింగే లేవండి.
* యోగా చేయండి.
* మంచి ఆలోచనలు ఏంటి?మీలో వచ్చే చెడు ఆలోచనలు ఏంటో తెలుసుకోండి.
* ఎవరికైనా క్షమించు లేదా ధన్యవాదాలు చెప్పేవి ఉంటే చెప్పండి.
* తప్పకుండా మీరు చేయాలనుకున్న పనులు 2 రాసుకుని పెట్టుకోండి.
* మీకు ఇష్టమైన పాటలు బాత్రూమ్ లో ఇంట్లో గట్టిగా పాడండి.
* ఒక రోజు డాన్స్ చేయండి.