- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజూ స్నూజ్ బటన్ నొక్కుతున్నారా? అయితే మీకు తెలివితేటలు ఎక్కువే.. !
దిశ, ఫీచర్స్: ఆకస్మికంగా నిద్రలేవడంతో పోలిస్తే స్నూజ్ పెట్టుకుని మేల్కోవడం అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుందని జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ కొత్త నివేదిక తెలిపింది. గాఢ నిద్ర నుంచి ఒకేసారి బయటకు రావడం కన్నా స్నూజ్‌తో లేవడం మగతగా ఉన్న వ్యక్తులకు సహాయకారిగా ఉంటుందని వివరించింది. లేజీనేస్ నుంచి బయటపడడంతో పాటు రోజంతా ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేస్తారని చెప్పింది.
69 శాతం మంది స్నూజ్ ఫంక్షన్‌ను ఉపయోగిస్తున్నారని.. సగటు స్నూజ్ సమయం 22 నిమిషాలని తెలిపిన అధ్యయనం.. 30 నిమిషాల పాటు అలారమ్ ఆపేసిన వారు అభిజ్ఞా పరీక్షలలో మెరుగైన పనితీరు కనబరిచినట్లు వివరించింది. చాలా మంది స్నూజర్‌లు యువకులేనని, 42 శాతం మంది కౌమారదశలో ఉన్నవారు మేల్కొనడానికి ఇబ్బంది పడుతున్నారని జనాభా అధ్యయనాలు సూచిస్తున్నాయని నివేదిక పేర్కొంది. రాత్రి ఎక్కువ సేపు నిద్ర లేకుండా ఉన్నవారు.. డీప్ స్లీప్ స్టేజ్ నుంచి మేల్కొనడం వల్ల తాత్కాలికంగా స్నూజ్ బటన్‌ను నొక్కే అవకాశం ఉంది.