- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Health Benefits : మిరియాలలో ఏముందిలే అని తీసిపారేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవాల్సిందే
దిశ, ఫీచర్స్ : సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియాలు అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. వంటకాల్లో రుచిని పెంచడానికి వీటిని ఎక్కువగా వాడతారు. వీటిని వేయడం వలన ఆహారానికి మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. అంతే కాదు వీటిని ఎక్కువగా ఔషధంగా వాడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో, చలికాలంలో వచ్చే దగ్గు, జలుబుకు, ముక్కుదిబ్బడ, గొంతు గరగరకు, అజీర్తికి ఇలా ఒక్కటేమిటి ఎన్నో వ్యాధులకు ఔషధంగా వీటిని వాడతారు.
ఇక మిరియాలలో ఉండే పోషకాల విషయానికొస్తే వీటిలో మాంగనీసు, పొటాషియం, పీచు పదార్థం, ఐరన్,కాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అలాగే మిరియాలలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. దీంతో రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థ, మెండుగా ఉంటుంది. వీటిలో డికాషన్, టీ, కషాయం లాంటి బరువు తగ్గించే పానీయాలను కూడా తయారు చేయవచ్చు. అంతే కాదండి మిరియాలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాలతో ప్రయోజనాలు..
1. కీళ్ల నొప్పులకు చెక్ : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు చాలామంది ఎదుర్కొనే సమస్యలలో కీళ్ల నొప్పులు ఒకటి. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఎన్నో కొన్ని నల్లమిరియాలు చేర్చడం వలన ఇది కీళ్లలో నొప్పులు, వాపులు నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. బరువు తగ్గడం : ఈ మధ్యకాలంలో సరైన డైట్ ఫాలో కాకపోవడంతో చాలామంది మోతాదుకు మించిన బరువు పెరిగి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి నల్ల మిరియాలు మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే యాంటీ ఒబెసిటీ, పైపెరిన్ గుణాలు అధిక బరువును క్రమంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయంటున్నారు.
3. పసుపుతో : పసుపుతో కలిపి మిరియాలు తీసుకోవడం వలన శరీరంలోని క్యాన్సర్లను కూడా నివారిస్తుందంటున్నారు. పాలలో మిరియాల పొడి, పసుపు కలిపి తాగితే జలుబు, దగ్గుకి ఇట్టే చెక్ పెట్టొచ్చు. వీటిలో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ లు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో సహాయపడతాయి.
4. అసిడిటీలో ఉపశమనం : నల్లమిరియాలను పచ్చిగా తింటే హైడ్రోక్లోరిక్ యాసిడ్లు కడుపులో నుంచి విడుదలవుతాయి. ప్రేగులను శుభ్రపరచడంలో ఈ ఆమ్లం ఎంతగానో సహాయపడుతుంది. దీంతో జీర్ణశయాంతర వ్యాధులు కూడా దరిచేరవు. అందుకే వంటకాల్లో నల్ల మిరియాలు జోడించాలంటున్నారు నిపుణులు. అలాగే మిరియాలను నూర్చే టప్పుడు వెలువడే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా వాడితే తలనొప్పి వంటి దీర్ఘ వ్యాధులు దూరం అవుతాయంటున్నారు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.
Read More..
pine nuts : బంగారంకంటే విలువైన గింజలు.. తినడంవల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!