Head Bath: తల స్నానం చేసిన తర్వాత చెమటలు పట్టకుండా ఉండాలంటే వీటిని పాటించండి!

by Prasanna |   ( Updated:2023-04-24 14:40:34.0  )
Head Bath: తల స్నానం చేసిన తర్వాత  చెమటలు పట్టకుండా ఉండాలంటే వీటిని పాటించండి!
X

దిశ, వెబ్ డెస్క్: మనకు చెమట ఎక్కువగా పడితే వెంటనే స్నానం చేస్తాం. కానీ కొంతమందికి తలస్నానం చేసిన తర్వాత చెమటలు పడుతుంటాయి.ఈ సమస్య కొంత మందికి చికాకు కలిగిస్తుంది. అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నప్పుడు చెమటలు పడితే ఆ సమయంలో వస్తున్న కోపానికి ఎవరు ఏమి అనలేక సైలెంట్‌గా ఉండి పోతాము. సాధారణంగా వేడి నీళ్లతో స్నానం చేసే వారికీ చెమట సమస్య అధికంగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు వేడి నీటి ఆవిరి బాత్రూమ్ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ క్రమంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి మరియు చెమట పట్టేలా చేస్తుంది.స్నానం చేసిన తర్వాత చెమటలు పట్టకుండా ఉండాలంటే వీటిని పాటించండి.

1. విపరీతంగా చెమటలు పట్టినప్పుడు వెంటనే తలస్నానం చేసినా పర్లేదు.. కానీ యోగ చేసిన తర్వాత చెమట పట్టినప్పుడు ముప్పై నిమిషాల తర్వాత తల స్నానం చేయండి. దీని వల్ల చెమట కూడా తగ్గుతుంది.

2. మనలో కొందరు గంటల తరబడి బాత్‌రూమ్‌లోనే గడుపుతుంటారు. బాత్రూంలో ఎక్కువ సేపు ఉండడం వలన చెమటలు పడతాయి.కాబట్టి ఎక్కువ సేపు బాత్‌రూమ్‌లో ఉండకండి.

ఇవి కూడా చదవండి : ఇంటి వద్ద నీటి సంప్ ఏటువైపు ఉంటే మంచిదో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed