- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం పూట శృంగారం చేయడం మంచిది కాదా..?
దిశ, ఫీచర్స్ : తెల్లవారు జామున లేదా ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే కీడు జరుగుతుంది అంటుంటారు కొందరు. కానీ ఇది నిజం కాదు అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఉదయం పూట రకరకాల ఆలోచనలు మైండ్‌లో ఉండవు, టెన్షన్‌కు గురయ్యే చాయిస్ అస్సలు ఉండదు. కాబట్టి సెక్స్‌లో పాల్గొనడం దంపతులకు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుందని సెక్సాలజిస్టులు చెప్తున్నారు. మార్నింగ్ టైమ్‌లో సెక్స్ చేయడంవల్ల శరీరంలో ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల హార్మోన్లు రిలీజ్ అవుతాయి.
ఉరుకులు, పరుగుల జీవితంలో రకరకాల పనులు, ఉద్యోగాల్లో ఒత్తిడుల కారణంగా రాత్రిపూట సెక్స్‌లో పాల్గొనడంపట్ల ఒక్కోసారి ఆసక్తి లేకపోవడమో, పాల్గొన్నా తగిన అనుభూతిని ఆస్వాదించలేకపోవడమో అప్పుడప్పుడూ జరగవచ్చు. అలాంటివారు ఉదయంపూట ట్రై చేస్తే సంతృప్తి చెందే అవకాశం అధికంగా ఉంటుందని అమెరికన్ సెక్సాలజిస్టు డేవిడ్ నెల్సన్ అంటున్నారు. అంతేకాదు ఉదయంపూట సెక్స్‌లో పాల్గొనడంవల్ల పురుషుల్లో 'టెస్టో స్టిరాన్' అనే హార్మోన్ సహజంగానే అధికంగా రిలీజ్ అవుతుంది.
దంపతులిద్దరిలోనూ ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై మెదడుకు పాజిటివ్ సంకేతాలను అందించడంవల్ల ఇక ఆరోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉదయంపూట కలయిను ఆస్వాదించడంవల్ల మానసిక ఒత్తిళ్లు దూరం అవుతాయి. శరీరాన్ని యవ్వనంగా ఉంచగలిగే ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా ఉదయంపూట సెక్స్‌లో పాల్గొనడంవల్ల ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి దంపతులు అపోహలు, మూఢ నమ్మకాలను వీడి ఉదయంపూట కూడా నిస్సందేహంగా సెక్స్‌లో పాల్గొని మధురమైన అనుభూతి పొందవచ్చు.
Also Read..