- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా హక్కు.. ఇంటి పనుల్లో సహాయం కావాల్సిందే!!
దిశ, ఫీచర్స్: సాధారణంగా భారతదేశంలో ఇంటి పనులు చూసుకోవడం స్త్రీల బాధ్యతగా పరిగణిస్తుంటారు. కానీ ఈ అంశంలో సహాయం పొందగలగడం మహిళలు అదృష్టంగా భావిస్తుంటారు. ఉదయాన్నే లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు గడియారం ముల్లు మాదిరిగా తిరుగుతూ పని చేస్తూనే ఉండటం కంటే కాస్త విశ్రాంతి తీసుకుంటే.. మానసికంగా, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. కానీ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇదంతా సాధ్యమవుతుందా? ఇక భర్తతో పాటు వర్క్ చేస్తున్న భార్య పరిస్థితి సరే సరి. అటు ఆఫీస్ ఇటు ఇల్లు.. మరో వైపు పిల్లలను చక్కదిద్దుతూ అలసిపోతుంది. కాస్త సహాయాన్ని కోరినా అందుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే ‘ఇంటి పనుల్లో సహాయం పొందడం అమ్మాయి హక్కు’గా మారాలని డిమాండ్ చేస్తున్నారు ఫెమినిస్టులు.
సాధారణంగా ఉద్యోగాలు చేసే మహిళలు మార్నింగ్ లేచి భర్త, పిల్లలు, తన కోసం బ్రేక్ ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసుకుని.. వారికి అవసరమైనవి అన్నీ అందించి.. స్కూల్స్, ఆఫీసులకు పంపించి.. ఆ తర్వాత తను కూడా పరుగెత్తాల్సి ఉంటుంది. ఎనిమిది గంటల ఆఫీస్ వర్క్ ముగించుకుని.. ఇంటికి చేరే సరికి.. మళ్లీ అవే పనులు వెల్‌కమ్ చెప్తున్నట్లుగా ఉంటుంది. దీంతో చేతికున్న బ్యాగ్ ఓ పక్కన పెట్టేసి కిచెన్‌లోకి పరుగెత్తాల్సిందే. భోజనం ప్రిపేర్ చేసి.. పిల్లలతో హోమ్ వర్క్ చేయించి.. ఇల్లంతా శుభ్రం చేసుకుని.. బెడ్‌పై చేరేసరికి అర్థరాత్రి అవుతుంది. ఇదంతా మిడిల్ క్లాస్ ముచ్చట. అయితే కొంచెం రిచ్ ఫ్యామిలీకి చెందిన మహిళలు మాత్రం పని మనిషిని పెట్టుకుని.. ఇలాంటి పనులకు సహాయం తీసుకుంటూ ప్రయోజనం పొందుతుంటారు. పని భారాన్ని తగ్గించుకుంటారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు పని మనిషి గురించి పెట్టే ఖర్చు మరో ముఖ్యమైన పనిమీద పెడితే ప్రతిఫలం బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంటారు. అది కూడా నిజమే. కానీ 24 గంటలు రెస్ట్‌లెస్‌గా ఉంటున్న ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేదే ప్రశ్న.
ఓ మహిళ 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. తన పనులతో పాటు ఆఫీసు పని, ఇంటి పనులన్నీ సాధారణ రోజులో నిర్వహించడం చాలా కష్టంగా ఉండేదని చెప్తోంది. కానీ పని మనిషిపై పెట్టుబడి పెట్టేంత బడ్జెట్ లేకపోవడంతో ప్రొఫెషనల్ అండ్ డొమైన్ వర్క్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం తప్పా వేరే ఆప్షన్ లేదు. అయితే తన స్నేహితురాలు మాత్రం రిచ్ కావడంతో ఆమెకు భోజనాలు వండి, ప్లేట్‌లో వడ్డించేందుకు ఇంటిలో సహాయాన్ని కలిగి ఉండేది. దుస్తులు ఉతికి, అల్మారాలో సర్దిపెట్టే బాధ్యత మరొకరు తీసుకునేవారు. పెంపుడు కుక్కలను చూసుకునేందుకు ఒకరు.. ఆమెను ఆఫీసు దగ్గర దింపేందుకు కారు డ్రైవర్ ఇలా ప్రతీ చోట హెల్ప్ తీసుకునేది. కానీ మధ్యతరగతి అమ్మాయి విషయానికొస్తే.. ప్రతీ పని తనే చేసుకోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలో చాలా తక్కువ ఆందోళనతో ఉన్న తన స్నేహితురాలు ఉద్యోగంలో బాగా పని చేస్తుంది. ప్రమోషన్స్ పొందుతుంది. హైక్స్ అందుకుంటుంది. ఎందుకంటే తనకు విశ్రాంతి బాగా లభిస్తుంది. ఉద్యోగంపై అవిభక్త శ్రద్ధను ఇవ్వడానికి సమయం, స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి మాత్రం అలసిపోయిన శరీరం, మనస్సుతో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే అదే రిచ్ అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ మధ్య అంతరం ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. కానీ ఈ మధ్య తరగతి అమ్మాయికి పని మనిషి లేకపోయినా.. ఇంట్లో ఉన్న భర్త లేదా అత్తామామల నుంచి సహాయం అందితే రిచ్ క్లాస్ అమ్మాయి లాగే కచ్చితంగా రాణించగలదు. ప్రమోషన్స్ పొందగలదు. కెరీర్‌లో మరో మెట్టు ఎదగగలదు. కానీ ఆల్మోస్ట్ అది సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఇంటి పనులు లింగం మీద ఆధారపడి ఉంటాయి. స్త్రీలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా భర్త ఎంత తక్కువ సంపాదించినా.. ఇంటికి వచ్చే సరికి భార్యే ఇంటి, వంట పనులు చేయాలని చాలా కుటుంబాలు వాదిస్తున్నాయి. వేధిస్తున్నాయి. ఇప్పటికీ అదే మూసధోరణిని అవలంబిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :