- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గిల్ట్‌తో కుంగిపోతున్నారా? ఈ స్టోరీ చదివితే రిలీఫ్ ఉండొచ్చు..

దిశ, ఫీచర్స్ : అపరాధ భావన.. గిల్ట్.. పిలవకుండానే వచ్చి మనం చేసిన తప్పును ఎత్తి చూపే స్నేహితుడి లాంటిది. 24 గంటలు మన మనస్సును కొరుకుతూనే ఉంటుంది. మరిచిపోవడం అసాధ్యమని రిమైండ్ చేస్తూనే ఉంటుంది. భుజాలపై కనిపించని బరువులా మారి.. నువ్వు ఆ పని అలా కాకుండా మరోలా చేసి ఉంటే.. ఇంత దారుణం జరిగేది కాదు కదా అని నిరంతం వేధిస్తుంది. అంతులేని లూప్‌లో చిక్కుకున్న మనకు బయటకు రావడం దాదాపు ఇంపాజిబుల్ అనే స్థితి వచ్చేస్తుంది. కానీ ఈ అపరాధ భావన మనను నాశనం చేసేందుకు కాకుండా.. జీవిత పాఠాన్ని బోధించేందుకు ఉద్దేశించబడితే.. దాన్ని జ్ఞానం, బలంగా మార్చుకోగలిగితే.. మనల్ని మనం క్షమించుకోవచ్చు.. శిక్షకు బదులు శాంతిని పొందవచ్చు.. భారతదేశ ఆధ్యాత్మిక మార్గదర్శి భగవద్గీత చెప్తున్నదేంటి? మనం గిల్ట్ నుంచి బయటపడేందుకు ఎలా సహాయపడుతుంది?
1. మూలాన్ని అర్థం చేసుకోవడం
మనం తప్పు చేశామని నమ్మినప్పుడు అపరాధ భావన అనేది సహజమే. కానీ కొన్నిసార్లు ఇది స్వీయ శిక్షగా మారవచ్చు. మనల్ని ముందుకు సాగకుండా ఆపవచ్చు. అలా కాకుండా కృష్ణుడు గీతలో అర్జునుడికి చెప్పినట్లుగా.. వర్తమానం(ప్రజెంట్)పై దృష్టి పెట్టమని, అనవసరమైన దుఃఖంలో మునిగిపోవద్దని గుర్తు చేస్తున్నారు నిపుణులు. గతం గురించి ఆలోచన ఎలాగూ బాధలకు దారితీస్తుంది. నిజానికి అపరాధ భావాన్ని గుర్తించడం అవసరమే.. కానీ అది మనల్ని డిఫైన్ చేయకూడదు.
2. అసంపూర్ణతలను అంగీకరించడం
అపరాధ భావన నుంచి మనల్ని మనం విడిపించుకోవడం చాలా ముఖ్యం. మానవులు తప్పులు చేయడం సహజమని మన లోపాన్ని అంగీకరించినప్పుడు.. స్వీయ క్షమాపణ సాధ్యం అవుతుంది. మిస్టేక్స్ యాక్సెప్ట్ చేసి.. వృద్ధికి అవకాశాలుగా మార్చుకోవాలని భగవద్గీత కూడా బోధిస్తుంది. ఎందుకంటే మెరుగుదల కోసం ప్రయత్నిస్తూనే మన బలహీనతలను గుర్తించడంలో నిజమైన బలం ఉంది. మనల్ని మనం కఠినంగా జడ్జ్ చేసుకోవడం మానేసినప్పుడు.. సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ఉంటుంది.
3. విచారం కాదు చర్య అవసరం
తప్పు చేశామనే భావన మనల్ని తినేస్తుంది. ఆ విచారం తరుచుగా స్తంభింపజేస్తుంది. గతంలో చిక్కుకునేలా చేస్తుంది. అయితే అలా అక్కడే ఆగిపోకుండా.. చేసిన తప్పుకు బాధ్యత వహించండి. క్షమాపణ చెప్పండి. సరిదిద్దుకోండి. అంతేకానీ ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండిపోతే దీర్ఘకాలిక బాధ తప్పదు.
ఫలితం కంటే ప్రక్రియపై దృష్టి పెట్టడం ద్వారా.. అంతులేని అపరాధ చక్రం నుంచి మనల్ని మనం విడిపించుకోవచ్చు. భగవద్గీత ప్రధాన బోధనలలో చర్య ప్రాముఖ్యత కూడా ఒకటి.
4. అహం నుంచి దూరం
అపరాధ భావన మన ఆదర్శవంతమైన సంస్కరణ. అయితే మనలో ఉన్న అహం.. మనం చేసిన తప్పును వైఫల్యంగా చూస్తుంది. అలా కాకుండా అహం నుంచి దూరమైతే.. జీవిత పాఠంగా చూడటానికి సహాయపడుతుంది. విచక్షణ మన తప్పులను ప్రతికూల భావోద్వేగాలతో మునిగిపోకుండా.. సరిగ్గా విశ్లేషణ చేసుకునేందుకు సాయం చేస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు అదృష్టం పట్టిందని సంతోషించనివాడు.. దురదృష్టం వెంటాడుతుందని ఏడ్వనివాడు.. పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు.
5. కుంగిపోకుండా ఆలోచించు
మన అభివృద్ధికి స్వీయ ప్రతిబింబం చాలా అవసరం. అయితే ఆరోగ్య, విషపూరిత ఆలోచనల మధ్య సన్నని గీత ఉంది. ఈ గీత మనల్ని ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించమని, విచారంలో మునిగిపోయే బదులు తప్పుల నుంచి నేర్చుకోవాలని ప్రోత్సహిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి స్థిరంగా ఉండమని.. భావోద్వేగాలు అతని తీర్పును ప్రభావితం చేయకుండా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. అంటే మనస్ఫూర్తిగా ఆలోచించడం వల్ల మనకు స్పష్టత వస్తుంది. మనల్ని మనం బ్లేమ్ చేసుకోకుండా నిరోధిస్తుంది.
6. క్షమించుకోండి
భయపడకు.. నన్ను క్షమించమని కోరు.. నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను.. అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అపరాధ భావం.. అంటే తప్పును అంగీకరించడం శాంతిని కనుగొనే మార్గంగా ఉంటుంది. సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ఇందుకు బెస్ట్ ఆప్షన్. అంటే ప్రతిదీ ఒక కారణంతోనే జరుగుతుందని గుర్తించడం ద్వారా మనస్సుకు శాంతి కలుగుతుంది. ప్రశాంతత లభిస్తుంది. గిల్ట్‌ను పనిష్మెంట్‌గా కాకుండా టీచర్‌గా చూస్తే.. మన గురించి మనకు మరింత తెలుస్తుంది. మంచి మార్పు ఉంటుంది. మనం కరెక్ట్ మైండ్ సెట్‌తో ఉంటే ప్రతి తప్పు కూడా ఒక స్టెప్ స్టోన్ అవుతుంది. గిల్ట్ అనేది టెంపరరీ కానీ అది మనకు చెప్పే లెస్సన్స్.. మన జీవితాన్నే మార్చేస్తాయి.