Google Search : గూగుల్‌లో సెర్చ్ చేయకూడని 3 ప్రధాన విషయాలు ఇవే.. పొరపాటున చేసినా నేరమే!

by Javid Pasha |   ( Updated:2024-08-25 14:06:02.0  )
Google Search : గూగుల్‌లో సెర్చ్ చేయకూడని 3 ప్రధాన విషయాలు ఇవే.. పొరపాటున చేసినా నేరమే!
X

దిశ, ఫీచర్స్ : గూగుల్ అంటేనే సమాచార సర్వస్వం. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందంటే అది గూగులే.. ఏ డౌట్ వచ్చినా.. ఏ ఇన్ఫర్మేషన్ వెతికినా క్షణాల్లో మన ముందుంచుతుంది ‘Google’. అయితే మారుతున్న కాలంతోపాటు ఈ బిగ్గెస్ట్ ఇన్ఫర్మేషన్ హబ్ యూజర్ల భద్రతాపరమైన విషయంలోనూ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పలు నిబంధనలు ఇప్పటికే తీసుకొచ్చింది. కాగా గూగుల్ ప్రైవసీ, ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్ డొపమైన్లలో సెర్చ్ చేయకూడనివి లేదా నిషేధించబడినవి మూడు ప్రధాన విషయాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒక వేళ వీటిని పొరపాటున సెర్చ్ చేసిన నేరమే అవుతుందని, జైలుకెళ్లడం ఖాయమని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* ఐటీ నిబంధనల ప్రకారం.. గూగుల్లో పిల్లలకు సంబంధించిన అశ్లీల సాహిత్యాన్ని, వీడియోలను, కంటెంట్‌ను సెర్చ్ చేయడం నేరం. ఈ విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి అన్‌వాంటెడ్ అంశాలను వెతికితే 5 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉంది.

* ప్రైవసీ పాలసీలో భాగంగా గూగుల్లో బాంబు తయారీకి సంబంధించిన సమాచారం, అలాగే తయారీ మార్గాలను వెతకరాదు. అలా చేస్తే వివిధ పద్ధతుల్లో గూగుల్ వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలకోసం ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తుంది. దీంతో జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

* అట్లనే గూగుల్‌లో సెర్చ్ హ్యాకింగ్ మెథడ్స్ గురించి కూడా గూగుల్లో వెతకడం నేరంగా పరిగణించబడుతుంది. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి గూగుల్ అస్సలు ఇష్టపడదు. పైగా నిషేధించబడిన అంశం కాబట్టి పొరపాటున సెర్చ్ చేసినా చట్టం ప్రకారం జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed