- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Food adulteration : ఆహార పదార్థాల్లో కల్తీ జరిగిందని అనుమానమా..? ఇలా గుర్తించండి!
దిశ, ఫీచర్స్ : ఫలానా ఆహారంలో, పానీయాల్లో కల్తీ జరిగిందనే వార్తలు తరచూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. పాల నుంచి పండ్ల వరకు, తేనె మొదలు కొని సుగంధ ద్రవ్యాల వరకు కల్తీలేని పదార్థాలేవీ లభించడం లేదనే మాటలు ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్నాయి. ఒకటో రెండో వస్తువులు కాదు.. పప్పు, బియ్య, పిండి, కారం పొడి, టీ పొడి అన్నీ కల్తీ అవుతున్నాయనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిపుణుల ప్రకారం ఇంటిలోనే కల్తీని గుర్తించే కొన్ని చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* పాలు, తేనె : మీరు పాలు కల్తీ జరిగాయో లేవో ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక పాత్ర మీద మీకు అనుమానంగా అనిపించే పాలలో నుంచి ఒక చుక్క తీసి పోయాలి. అవి ఎటువంటి మరక లేకుండా కిందకు జారితే నీళ్లు కలిపినట్లు అర్థం. ఇక నురగ వస్తే మాత్రం యూరియా లేదా డిటర్జంట్ కలిపినట్లు అనుమానించవచ్చు. ఇక తేనె విషయానికి వస్తే గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో రెండు చుక్కల తేనె కలపండి. అప్పుడు తేనె కిందికి చేరితో కల్తీ లేదని అర్థం. ఒకవేళ నీళ్లల్లో కూడా తేనె కలిసిపోతే కల్తీ జరిగిందని అర్థం.
* పసుపు, కారం, టీ, కాఫీ : ఇక పుసుపు, కారం కల్తీని కూడా సింపుల్‌గా గుర్తించవచ్చు. కొన్ని నీళ్లు తీసుకొని అందులో పసుపు కలపండి. అది అడుగు భాగానికి చేరితే కల్తీ లేనట్లు. రంగు ఒక్కటే నీటిపై సపరేట్‌గా తేలియాడుతుంటే కల్తీ జరిగినట్లు లెక్క. కారానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇక కాఫీ, టీ పొడి కల్తీని కూడా ఈజీగానే గుర్తించవచ్చు. ఒక తడిపేపర్ మీద కాస్త టీ పొడిని చల్లండి. దానిమీద మరేదైనా రంగు కనిపిస్తే కలర్ కలిపినట్లు అనుమానించాలి. అట్లనే ఓ గ్లాసులో నీరు తీసుకొని అందులో కాఫీ పొడి కలిపితే అది మంచిదైతే అడుగు భాగానికి చేరే ముందు నీటిపై తేలుతుంది. కల్తీ జరిగినట్లయితే గనుక నేరుగా అడుగు భాగానికి చేరుతుందని నిపుణులు చెప్తున్నారు.
* పండ్లు, కూరగాయలు, మాసం : కూరగాయలపై రంగు పూసినట్లు మీకు అనుమానం వస్తే కొద్దిగా కాటన్ తీసుకొని నీటిలో ముంచి కూరగాయలపై రుద్దండి. మీ చేతిలో ఉన్న కాటన్ రంగు మారితే కలర్ పూసినట్లు అర్థం. అరటి పండులో కల్తీని గుర్తించాలంటే.. దానిపై కొన్ని నీటి చుక్కలు వేయండి. ఆ డ్రాప్స్ పడినచోట గోధుమ రంగులోకి మారితే కార్బైడ్ లాంటి కెమికల్స్ కలిపి ఉండవచ్చునని అనుమానించాలి. ఇక మాసం విషయానికి వస్తే స్వచ్ఛమైన మాంసంలో ఎలాంటి షైనింగ్ ఉండదు. ఎక్కువగా షైనింగ్ కనిపించినా, దానిని నొక్కితే గట్టిగానో, రబ్బర్ మాదిరిగానో అనిపిస్తేనో కెమికల్స్ కలిసి ఉండవచ్చునని లేదా పాడైపోయి ఉండవచ్చునని అనుమానించాలి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.